బీబీసీ పరిశోధన: కామెరూన్‌లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే..

వీడియో క్యాప్షన్, బీబీసీ కామెరూన్ పరిశోధన

ఉత్తర కామెరూన్‌లో కొంతమంది మహిళలనూ, పిల్లలనూ అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనకు సంబంధించిన వివరాలు బీబీసీ చేపట్టిన పరిశోధనలో బయట పడ్డాయి. ఆ ఘటన ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? ఎవరు దీనికి పాల్పడ్డారు? అన్న వివరాలు తెలిశాయి. మొదట్లో ఈ వీడియోను "ఫేక్ న్యూస్" అంటూ ఖండించిన కెమరూన్ ప్రభుత్వం.. ఆ తరువాత ఈ హత్యాకాండకు బాధ్యులైన ఏడుగురు సైనికులను అరెస్ట్ చేసింది.

ఈ మహిళలను, పిల్లలను చంపెయ్యడానికి తీసుకెళ్తున్నారు. వీళ్ళు బోకోహరాం అనే జిహాదిస్టు గ్రూప్‌కు చెందిన వారని సైనికులు ఆరోపిస్తున్నారు.

ఈ వీడియో చివర్లో వారి కళ్ళకి గంతలు కట్టేసి, వారిని కిందకు తోసేసి, వారిపై 22 రౌండ్లు కాల్చారు.

ఈ దారుణం మాలిలో జరిగిందని కొంతమంది అన్నారు. మరి కొంతమంది, ఉత్తర కామెరూన్ లో జరిగిందని అన్నారు. ఈ ప్రాంతంలో 2014 నుంచి బోకో హరామ్‌తో ప్రభుత్వ సైనికులు పోరాడుతున్నారు.

బీబీసీ పరిశోధనలో ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? ఎప్పుడు జరిగింది? ఈ దారుణానికి పాల్పడిందెవరు? అన్న విషయాలు మొదటిసారి వెల్లడయ్యాయి.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)