వైరల్: ఆ చిన్నారి అపహరణ నిజం కాదు.. అది ఫేక్ వీడియో
(హెచ్చరిక: వీడియోలో కలవరపరిచే దృశ్యాలు ఉన్నాయి. )
ఒక చిన్నారిని ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని చూపే ఒక వీడియో భారత్‌లో వైరల్ అవుతోంది. ఇది ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. చిన్నపిల్లలను ఎత్తుకెళ్లేవారేమోననే అనుమానంతో కొత్తవారిపై స్థానికులు దాడులు కూడా చేశారు.
చిన్నారి కిడ్నాప్ అయినట్లు కనిపిస్తున్న ఈ వీడియోలో కనిపిస్తున్నది మాత్రమే నిజం కాదు. వాస్తవానికి ఇది పాక్‌లో భద్రతపై తీసిన వీడియోలోని ఒక భాగం. చిన్నారిని 'కిడ్నాపర్' తర్వాత అక్కడే వదిలిపెట్టాడు. 'కరాచీ వీధుల్లో పిల్లలను కిడ్నాప్ చేయడానికి క్షణం చాలు' అనే సందేశాన్ని అతడు చూపించాడు.
భారత్‌లో ఈ వీడియోలోని రెండో భాగాన్ని తొలగించారు. ఇలాంటి వీడియోలు వాట్సప్‌లో చక్కర్లు కొట్టాయి. ఎడిట్ చేసిన వీడియోలను చూసినవారు భయాందోళనకు గురయ్యారు. ప్రాంతీయ వార్తాఛానళ్లు చేసిన పని సమస్యను మరింత తీవ్రతరం చేసింది. ఛానళ్లు ఈ వీడియోలను చూపిస్తూ ఐదు వేల మంది కిడ్నాపర్లు దక్షిణ భారత్‌లోకి వచ్చారని ప్రజలను హెచ్చరించాయి.
లోగడ 26 ఏళ్ల కాలూ రామ్ ఉఫాధి కోసం బెంగళూరుకు వచ్చాడు. కొందరు స్థానికులు అతడిని పిల్లల కిడ్నాపర్ అనుకున్నారు. కాళ్లు, చేతులు కట్టేసి క్రూరంగా కొట్టారు. వీధుల్లో ఈడ్చుకెళ్లారు. ఆస్పత్రికి చేరుకునేలోపు అతడు చనిపోయాడు.
బూటకపు వార్తలు ప్రాణాలు కూడా తీయగలవనేందుకు బెంగళూరు ఘటన ఒక ఉదాహరణ.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)