You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కొందరు ఆడవారి శరీరం నుంచి వచ్చే వాసనకు మగవారు ఎందుకు ఆకర్షితులవుతారు? మహిళల శరీర వాసనకూ, సంతానోత్పత్తికి సంబంధం ఏమిటి?
స్త్రీ పట్ల పురుషుడు ఆకర్షితుడు కావడంలో ఆమె నుంచి వెలువడే వాసన పాత్ర ఉంటుందా?
కొందరు స్త్రీల శరీరం నుంచి వచ్చే వాసన పట్ల మగవారు ఎందుకు ఆకర్షితులవుతారు, ఇతర మహిళల శరీరం నుంచి వచ్చే వాసన పట్ల ఎందుకు ఆకర్షితులు కారనేది పరిశోధకులు గుర్తించారు.
కొందరు మహిళల బాహుమూలల నుంచి వాసన నమూనాలను శాస్త్రవేత్తలు సేకరించారు. ఈ వాసనలు చూసి, రేటింగ్ ఇవ్వమని స్విట్జర్లాండ్‌లో బెర్న్ విశ్వవిద్యాలయంలోని మగవారిని అడిగారు. వారు ప్రతి వాసనను పీల్చి చూసి అది తమను ఆకర్షిస్తోందో, లేదో చెప్పారు.
కొందరు మహిళల నుంచి సేకరించిన వాసన ఎందుకు ఎక్కువ ఆకర్షణీయంగా ఉందో పరిశోధకులు పరిశీలించారు.
హార్మోన్ల స్థాయులను బట్టి వాసన ఉన్నట్లు వారు గుర్తించారు. ఈస్ట్రడియల్ స్థాయులు ఎక్కువగా, ప్రొజెస్టిరాన్ స్థాయులు తక్కువగా ఉండటం కీలకం. మహిళల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని వారి నుంచి వచ్చే వాసన సూచించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఐయూడీ: ఈ పరికరంతో గర్భం రాదు.. ఎక్కువ మంది మహిళలు వాడట్లేదు
- పూజకు ముందు.. పీరియడ్లను వాయిదా వేసే పిల్ తీసుకుంటున్నారా?
- BBC Special: ఆయుష్మాన్ భారత్ - ఆరోగ్య శ్రీ ; తేడా ఏమిటి?
- రఫేల్ డీల్: అంబానీ సంస్థను.. ‘భారత ప్రభుత్వమే ప్రతిపాదించింది. మాకు ఇచ్చిన వారిని తీసుకున్నాం’
- ‘భాగస్వామిని ఆకట్టుకునే కళను మర్చిపోతున్న భారతీయులు’
- BBC Special: చైనా పెళ్లిళ్ల సంతలో ‘మిగిలిపోయిన అమ్మాయిలు’
- సెక్స్‌లో ఎంతసేపు పాల్గొన్నా భావప్రాప్తి కలగకపోవడానికి కారణమేంటి? ఇది వ్యాధి లక్షణమా?
- భారత్‌లో రెట్టింపైన మద్యం వినియోగం: ‘ఎక్కువగా తాగేది తెలుగువాళ్లే’
- భారత్ సున్నాను ఎలా ఆవిష్కరించింది?
- GROUND REPORT: జమ్మూ కశ్మీర్ పోలీసు హత్య: ఒడిలో పాప.. ఒంట్లో తుపాకీ తూటాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)