సిరియా యుద్ధం: అమెరికా హెచ్చరికల్ని ఖాతరు చేయని రష్యా.. ఇడ్లిబ్‌పై బాంబులు వేస్తున్న విమానాలు

ఫొటో సోర్స్, Getty Images
సిరియాలో తిరుగుబాటుదారుల అధీనంలో మిగిలిపోయిన చివరి ప్రాంతం ఇడ్లిబ్ మీద పట్టుసాధించేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. యుద్ధ విమానాలతో ఆ ప్రాంతం మీద బాంబులు వర్షం కురిపిస్తోంది.
బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఇడ్లిబ్ ప్రాంతంపై విచక్షణారహితంగా దాడులు చేయడం సరికాదని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
కానీ, ఈ హెచ్చరికను రష్యా ఖాతరు చేయలేదు. సిరియా ప్రభుత్వ దళాలు ఇడ్లిబ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోప్ అన్నారు.
అల్ ఖైదా అనుబంధ జిహాదీలు ఇడ్లిబ్ వాయువ్య ప్రాంతంలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. అక్కడున్న రష్యన్ సైనిక స్థావరాలపై దాడులు చేయడం, పౌర యుద్ధంపై రాజకీయ పరిష్కారం చేపడుతుంటే అడ్డుకోవడం చేస్తున్నాయి అని పెస్కోప్ తెలిపారు.
వైమానిక దాడులతో ఈ ప్రాంతంలో మానవ హననం జరుగుతోందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.
ఇడ్లిబ్‌లో రక్తపాతాన్ని ఆపేందుకు తక్షణమే చర్య తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిలోని సిరియా ప్రతినిధి స్టఫన్ డీ మిస్టురా.. రష్యా, టర్కీలను కోరారు. ఈ సమస్యపై ట్రంప్ వ్యాఖ్యానించడాన్ని స్వాగతించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ప్రభుత్వ అనుకూల బలగాలు ఏం చేస్తున్నాయి?
తిరుగుబాటు దారుల బలమైన ప్రదేశం ఇడ్లిబ్‌పై సిరియా దళాలు, దాని మిత్ర దేశాల సైన్యం దశలవారిగా దాడులకు దిగుతోంది.
హెచ్‌టీఎస్ తీవ్రవాద సంస్థకు ఇడ్లిబ్‌లో దాదాపు 10 వేల సైన్యం ఉంది. అలాగే, ఇక్కడి తిరుగుబాటు దారులకు టర్కీ మద్దతిస్తోంది.
అయితే ఇడ్లిబ్‌పై దాడులను వాషింగ్టన్ ఖండిస్తోంది.
''బషర్ అల్ అసద్ ఇడ్లిబ్ ప్రావిన్స్‌పై విచక్షణారహితంగా దాడులు చేయొద్దు. అదే జరిగితే రష్యా, ఇరాన్ రెండూ ఒక ఘోర విషాదంలో పాలుపంచుకున్నట్టే. వేలాది మంది ప్రజలు చనిపోయే అవకాశముంది. అలా జరగనివ్వకూడదు'' అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, AFP
అంతర్జాతీయ సమాజం ఎందుకు ఆందోళన చెందుతోంది
ప్రభుత్వం పూర్తిస్థాయి దాడులకు దిగితే పెను విపత్తు సంభవిస్తుంది అని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి డీ మిస్టురా హెచ్చరించారు.
‘జిహాదీలను ఓడించాలి కానీ, దానికి వేలాది మంది పౌరుల జీవితాలు బలికాకూడదు’ అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'ప్రస్తుత పరిస్థితే కీలకం'
సిరియా అంతర్యుద్ధంలో ప్రస్తుత పరిస్థితి అత్యంత కీలకమని, ప్రజలు అనుభవిస్తున్న బాధలు ఇప్పటిలో తీరేలా లేవని బీబీసీ రక్షణ, దౌత్య వ్యవహారాల ప్రతినిధి జోనాథన్ మార్కస్ అన్నారు.
ఇడ్లిబ్‌పై దాడులు ఆందోళన కలిగించే విషయమని చెప్పారు.
''ప్రభుత్వ ఆధీనంలోకి రాని చిట్టచివరి ప్రాంతం ఇడ్లిబ్. ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తెచ్చుకుంటే అది కీలక విషయం అనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడు సిరియాలోని కీలక ప్రాంతాలు మళ్లీ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినట్టే. కానీ, ఇంకా కొన్ని ప్రాంతాలు కుర్దుల చేతుల్లోనే ఉన్నాయి. ఉత్తర సిరియాలోని కొంత ప్రాంతాన్ని టర్కీ ఆక్రమించింది. దక్షిణాన టాన్ఫ్ ప్రాంతం అమెరికా మద్దతు ఉన్న మలీషియా ఆధీనంలో ఉంది. అందుకే సిరియా పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో వచ్చినట్లు అప్పుడే చెప్పలేం'' అని సిరియాలోని తాజా పరిణామాలను ఆయన విశ్లేషించారు.
సిరియా ప్రభుత్వం ఈ ప్రాంతాలన్నింటినీ శాశ్వతంగా స్వాధీన పరచుకోగలదా? టర్కీ, జోర్డాన్ దేశాలకు తరలిపోయిన వలసదారుల పరిస్థితేంటి? వంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయని చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
సిరియాలో యుద్ధం ఎందుకు? ఇడ్లిబ్‌పై పోరాటం దేనికి?
సిరియాలో నిరుద్యోగం పెరగడం, అవినీతి, రాజకీయ స్వేచ్ఛ లేకపోవడంతో అధ్యక్షుడు బషర్ అలీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు 2011లో ప్రజలు శాంతియుతంగా పోరాటం చేశారు. తర్వాత కాలంలో అది పూర్తిస్థాయి పౌర యుద్ధంగా మారింది.
నిరసనలు వెల్లువెత్తిన ప్రతిసారి ప్రభుత్వం.. సైన్యంతో అణచివేత కార్యక్రమాలు చేపట్టింది. దేశంలో అశాంతికి సీమాంతర ఉగ్రవాదమే కారణమని అధ్యక్షుడు అసద్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
యుద్ధం కారణంగా ఇప్పటి వరకు మూడున్నర లక్షల మంది చనిపోయారు. పలు నగరాలు నాశనమయ్యాయి. ఇతర దేశాలు ఈ యుద్ధంలోకి దిగాయి.
ఇతర దేశాలు, సంస్థలు సొంత అజెండాలతో సిరియాలో పరిస్థితిని మరింత సంక్షిష్టం చేసి అశాంతిని కొనసాగించే చర్యలకు పాల్పడుతున్నాయి.
సిరియా ప్రభుత్వానికి రష్యా, ఇరాన్ అండదండలు అందజేస్తుండగా, అక్కడి తిరుగుబాటు దారులకు అమెరికా, టర్కీ వత్తాసు పలుకుతున్నాయి.
ప్రస్తుతం ఇడ్లిబ్ ఒక్కటే జిహాదీలు,తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఇక్కడ దాదాపు 20 లక్షల మంది ప్రజలు, 10 లక్షల మంది చిన్నారులు ఉన్నారు.
అందుకే దీనిపై ఆధిపత్యం సాధించేందుకు రష్యా సైన్యంతో ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ ఇడ్లిబ్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే తిరుగుబాటు దారులు ఓడిపోయినట్లే.
ఇవి కూడా చదవండి:
- బుద్ధగయలో మైనర్లపై బౌద్ధ భిక్షువుల ‘లైంగిక వేధింపులు’
- మీ గర్ల్ ఫ్రెండ్‌కు సారీ ఎలా చెబుతారు?
- తదుపరి ‘యాపిల్’ ఏది? భవిష్యత్తు నంబర్ వన్ కంపెనీ ఇప్పుడు ఎక్కడుంది?
- డైమండ్ నగరంలో 'గోల్డెన్ స్వీట్' - మరి రుచి చూస్తారా?
- సిగరెట్ మానేయాలనుకునే వారే ఇది చదవాలి
- ‘రసాయన ఆయుధాలు వాడితే మళ్లీ దాడి చేస్తాం’.. సిరియాకు ట్రంప్ హెచ్చరిక
- సిరియా యుద్ధంలో ఎవరు ఎవరి వైపున్నారు? అక్కడ అసలేం జరుగుతోంది?
- 'టోమహాక్' క్షిపణులు: సిరియాపై దాడికి అమెరికా వాడింది వీటినే
- మనకు వెలుగిచ్చే సూర్యుడికే మరణం వస్తే? ప్రపంచం అంతమైపోతుందా?
- 'దళిత' పదం: అవమానకరమా... ఆత్మగౌరవ సంకేతమా?
- లక్షలాది ముస్లింలను చైనా ఎందుకు నిర్బంధిస్తోంది?
- ‘నేను అమ్మాయిలాగా మారుతున్నా.. ఇది సెక్స్‌కు సంబంధించినది కాదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











