సిరియాపై దాడులు.. లక్ష్యం నెరవేరింది ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images
సిరియాలోని డ్యూమాలో ఏప్రిల్ 8న జరిగిన అనుమానిత రసాయన దాడికి ప్రతిగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు వైమానిక, క్షిపణి దాడులు ప్రారంభించాయి.
బషర్ అల్-అసద్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘‘రసాయన ఆయుధాలకు సంబంధించిన స్థావరాలు’’ లక్ష్యంగా దాడులకు తాను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
శనివారం తెల్లవారుజామున సిరియా రాజధాని నగరం డమాస్కస్‌లోను, హామ్స్ నగరంలోను భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి.
ఈ దాడులు అంతర్జాతీయ చట్టాన్ని బాహాటంగా ఉల్లంఘించటమేనని, తాము రసాయన ఆయుధాలు వాడలేదని సిరియా ప్రభుత్వం తెలిపింది.
ఈ దాడులకు తగిన పరిణామాలు ఉంటాయని సిరియా కీలక మిత్రదేశం రష్యా హెచ్చరించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
చివరకు సిరియాపై జరిగిన దాడులను పొగుడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.
అమెరికా సైన్యాన్ని చూసి తాను గర్వపడుతున్నానని, దేశ చరిత్రలోనే ఘనమైన సైన్యం ఇదేనన్నారు.
అమెరికా సైన్యాన్ని అసలు దేనితోనూ పోల్చలేమని ట్వీట్ చేశారు. ఇక ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల గురించి ప్రస్తావిస్తూ..
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
''సిరియాపై దాడి ప్రణాళికను చక్కగా అమలు చేశారు. ఈ దాడిలో పాల్గొన్న ఇంగ్లండ్, ఫ్రాన్స్‌లకు, ఆ దేశాల సైనిక దళాలకు ధన్యవాదాలు. లక్ష్యం నెరవేరింది'' అని ట్వీట్ చేశారు.
06.15
‘లక్ష్యం నెరవేరింది’ : ట్రంప్
06:00
ఓసారి అడిగుండాల్సింది : బ్రిటన్ ప్రతిపక్ష నేత
బ్రిటన్ ప్రధాని థెరెసా మేకు ప్రతిపక్ష నేత కార్బిన్స్ లేఖ రాశారు. అందులో.. సిరియాపై గగనతల దాడులు చేయడానికి చట్టపరమైన కారణాలను తెలపాలని కోరారు.
ఇప్పటివరకూ బ్రిటీష్ మిలిటరీ అధికారులు సురక్షితంగా తిరిగిరావడం, సిరియాలో పౌరులెవ్వరూ గాయపడకపోవడం తనకు ఆనందంగా ఉందని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు.
అయితే.. సిరియాపై దాడి నిర్ణయానిక ముందు పార్లమెంటు అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవలసిందని ఆయన అన్నారు. ఇంగ్లండ్ ప్రధాని పార్లమెంటుకు మాత్రమే జవాబుదారి కానీ.. అమెరికా అధ్యక్షుడికి కాదు.. అని ఆ లేఖలో కార్బిన్ విమర్శించారు.

ఫొటో సోర్స్, AFP
05:45
అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే : చైనా
‘‘అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగా.. సైన్యాలను ఉపయోగించడానికి మేం వ్యతిరేకం. ఐక్యరాజ్య సమితి రక్షణ మండలి విధానాలను పక్కదోవ పట్టించే ఏ సైనిక చర్య అయినా.. అంతర్జాతీయ చట్టంలోని ప్రాథమిక సూత్రాలను అధిగమించినట్లే'’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హ్యూ ఛున్యింగ్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, Reuters
05:30
ఈ దాడులు మాకు మరింత బలాన్నిస్తాయి : అస్సాద్
సిరియాపై జరుగుతున్న దాడులపై ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ స్పందించారు.
ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహానీతో జరిగిన ఫోన్ సంభాషణలోనూ, సిరియా అధికార ట్విటర్ ఖాతాలో చేసిన ట్వీట్ మేరకు..
''దేశంలో టెర్రరిజాన్ని అణిచేవేసే క్రమంలో.. సిరియాను, సిరియా ప్రజలను ఈ దాడులు మరింత ధృడంగా తయారు చేస్తున్నాయి. సిరియాలోని టెర్రరిజంకు పాశ్చాత్య దేశాలు మద్దతిస్తున్నాయి'' అని అస్సాద్ అన్నారు.
ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడినపుడు.. సిరియాకు ఇరాన్ మద్దతు ఇస్తున్నట్లు మళ్లీ స్పష్టం చేశారు.
05:20
శాంతి చర్చలకు విఘాతం : రష్యా
సిరియాపై జరుగుతున్న దాడులు 'శాంతి చర్చల'పై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అన్నట్లు రష్యా ప్రభుత్వ మీడియా తెలిపింది.
''ఈ దాడులు.. తీవ్రవాదులు, మిలిటెంట్లు తమను తాము సమర్థించుకోవడానికి ఈ దాడులు ఉపకరిస్తాయని మరీయా జఖరోవా'' అన్నారు.

ఫొటో సోర్స్, Al-Ikhbariyah al-Suriyah

ఫొటో సోర్స్, Al-Ikhbariyah al-Suriyah

ఫొటో సోర్స్, Al-Ikhbariyah al-Suriyah
04:50
‘ఇవిగో క్షిపణి అవశేషాలు’ : సిరియా ప్రభుత్వ మీడియా
దాడుల్లో ఉపయోగించిన క్షిపణి అవశేషాలు అంటూ సిరియా ప్రభుత్వ టీవీ ఛానెల్ ఓ వీడియోను ప్రసారం చేసింది.
ఈ వీడియోను హమ్స్ సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు సిరియా ప్రభుత్వ ఛానెల్ తెలిపింది.

04:35
'ఈ దాడులు సరైనవి.. చట్టబద్ధమైనవి కూడా' : థెరెసా మే
సిరియాపై జరుగుతున్న గగనతల దాడులపై ఇంగ్లండ్ ప్రధాని థెరెసా మే మీడియా సమావేశం నిర్వహించారు.
''డ్యూమాలో జరిగిన అనుమానిత రసాయన దాడి సిరియా ప్రభుత్వం చర్య కాకపోతే మరెవరిది? తన దేశ ప్రజలమీదే.. రసాయన ఆయుధాలను ప్రయోగించిన ఘోరమైన చరిత్ర సిరియాది.
ప్రస్తుతం సిరియాపై జరుగుతున్న దాడులు 'సరైనవి.. చట్టబద్ధమైనవి కూడా!' కానీ సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో మేం కల్పించుకోవడం లేదు.
04:20
‘అనుమానిత రసాయన దాడి’ ఓ సాకు మాత్రమే! : పుతిన్
సిరియాపై జరుగుతున్న దాడులను రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో అత్యవసర ఐక్యరాజ్య సమితి సమావేశానికి పిలుపునిచ్చారు.
రష్యా ప్రభుత్వ టీవీ ఛానెల్‌లో మాట్లాడుతూ.. సిరియాపై దాడి ఓ దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.
గతవారం సిరియాలోని డ్యూమా పట్టణంలో రసాయన దాడి జరిగిందన్న సాకుతోనే ప్రస్తుతం ఈ దాడులు చేస్తున్నారని పుతిన్ అన్నారు.

ఫొటో సోర్స్, MOD
04.16
ఎవరూ గాయపడలేదు. రష్యా
తాజా దాడుల్లో ఎవరూ గాయపడలేదని రష్యా రక్షణ శాఖ పేర్కొంది. తమకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు.. సిరియాలో జరిగిన గగనతల దాడుల్లో పౌరులు గాయపడలేదని వివరించింది.
మొత్తం 103 క్షిపణుల్లో 71 క్షిపణులను సిరియా వాయుసేన అడ్డుకుందని వివరించింది.
04:00
పౌరుల నివాసాలకు దూరంగానే గగనతల దాడులు : యూకే
హమ్స్ నగరానికి పశ్చిమాన 24 కిలోమీటర్ల దూరంలోని ఒకప్పటి క్షిపణి స్థావరంపై 4 ఆర్.ఎ.ఎఫ్ టోర్నడో యుద్ధ విమానాల ద్వారా స్టార్మ్ షాడో క్షిపణులను ప్రయోగించినట్లు యూకే రక్షణ శాఖ తెలిపింది.
రసాయన ఆయుధాల తయారీకి అవసరమైన సామగ్రి నిల్వలున్నాయని భావిస్తున్న ప్రాంతంపై ఈ దాడులు జరిగాయి.
యూకే అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రజల ఆవాసాలు లేని చోట మాత్రమే తాము దాడులు చేస్తున్నామన్నారు.
దాడులు జరిగిన ప్రాంతాల్లో కాలుష్య ముప్పును కనిష్ఠ స్థాయికి పరిమితం చేసేలా శాస్త్రీయ పద్దతుల్లో చర్యలు తీసుకున్నామన్నారు.
‘స్థిరంగా’ సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్
సిరియా కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు అధ్యక్షుడు బషర్ అల్-అసద్ తన కార్యాలయానికి నడుచుకుంటూ వెళుతున్న ఒక వీడియోను సిరియా అధ్యక్ష కార్యాలయం ట్వీట్ చేసింది. దానికి శీర్షిక.. ‘ఉదయపు స్థిరత్వం’ అని పెట్టింది.
తమ స్థావరాలపై పాశ్చాత్య వైమానిక దాడుల వల్ల సిరియా ప్రభుత్వం ఏ విధంగానూ ప్రభావితం కాలేదని చెప్పటమే దీని సందేశంగా ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
‘సోవియట్ కాలం నాటి గగనతల రక్షణ వ్యవస్థను వాడిన’ సిరియా
అమెరికా నేతృత్వంలోని క్షిపణి దాడుల్ని ఎదుర్కొనేందుకు సిరియా దశాబ్ధాల కిందటి వ్యవస్థలను వినియోగించిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది.
‘‘ఎస్ 125, ఎస్ 200 సిరియా గగనతల రక్షణ వ్యవస్థలు, బుక్, క్వడ్రాట్‌లను క్షిపణుల్ని ఎదుర్కొనేందుకు వాడారు. 30 ఏళ్ల కిందట సోవియట్ యూనియన్‌లో తయారైన రక్షణ వ్యవస్థలివి’’ అని రష్యా రక్షణ శాఖ ప్రకటించినట్లు ఇంటర్‌ఫాక్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

ఫొటో సోర్స్, AFP
- సిరియాపై దాడులు ‘చట్టబద్ధమైనవి’ అని ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, విదేశాంగ శఆఖ మంత్రి జీన్ యెస్ లీ డ్రీన్ ప్రకటించారు. దాడులకు ముందుగానే రష్యాను కూడా హెచ్చరించామని పార్లీ తెలిపారు.
- సిరియాకు వ్యతిరేకంగా చేపట్టిన చర్యల్లో బ్రిటీష్ జోక్యాన్ని బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి బోరిస్ జాన్సన్ స్వాగతించారు.
బ్రిటన్ ప్రధాని ‘సమాధానం చెప్పాల్సిన ప్రశ్న’
ఈ దాడులు రసాయన ఆయుధాల వినియోగాన్ని ఎలా ఆపుతాయని స్కాట్లాంట్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టుర్జెన్ ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
- అసద్ ప్రభుత్వ రసాయన ఆయుధాల సామర్థ్యాన్ని నేరుగా ప్రభావితం చేసేలా దాడుల్ని రూపొందించామని అమెరికా సంయుక్త దళాల అధ్యక్షుడు జనరల్ జో డన్‌ఫోర్డ్ తెలిపారు.
- ‘ఓపీసీడబ్ల్యు విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నమే’ పాశ్చాత్య దేశాల దాడులు అని రష్యా పార్లమెంటు ఎగువ సభ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు కొన్‌స్టన్టింన్ కొసచెవ్ అన్నారని ఇంటర్‌ఫాక్స్ వార్తా సంస్థ తెలిపింది.
- అమెరికా నేతృత్వంలో ‘దూకుడు’కు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.
సిరియా రాజధాని వీధుల్లో నిరసనలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters
‘హమ్స్‌లో ముగ్గురు పౌరులకు గాయాలు’: సిరియా ప్రభుత్వ మీడియా
హమ్స్ ప్రావిన్సులోని సైనిక స్థావరం వద్ద శనివారం పేలిన క్షిపణులు ‘‘అడ్డంకులు తగిలి, దారితప్పాయి’’ అని సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ సనా తెలిపింది. కాగా, ముగ్గురు పౌరులకు గాయాలయ్యాయని కూడా వెల్లడించింది.
హమ్స్ నగరానికి పశ్చిమాన ఉన్న ఒక రసాయన ఆయుధాల స్థావరాన్ని లక్ష్యంగా దాడులు చేసినట్లు అమెరికా సైన్యం అంతకు ముందు ప్రకటించింది.
ఈ దాడుల వల్ల బర్జా జిల్లాలోని ప్రభుత్వ సైంటిఫిక్ స్టడీస్ అండ్ రీసెర్చి సెంటర్ (ఎస్ఎస్ఆర్సీ) శాఖలో ఆస్తికి మాత్రమే నష్టం వాటిల్లిందని ప్రభుత్వ టీవీ తెలిపింది.
శిక్షణా కేంద్రం, లాబొరేటరీలు ఉన్న భవనం దెబ్బతిందని ఒక నివేదిక తెలిపింది.
బర్జా స్థావరంలో రసాయన ఆయుధాలను తయారు చేస్తున్నట్లు తాము నమ్ముతున్నామని పాశ్చాత్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒకటి బీబీసీకి తెలిపింది. బర్జా స్థావరంతో పాటు డమ్మర్ జిల్లా, హమా ప్రావిన్సుల్లోని స్థావరాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతోందని వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
సిరియాలో రష్యా స్థావరాలు ‘సురక్షితం’
అమెరికా నేతృత్వంలోని దాడులు సిరియాలో ఉన్న తమ నౌకా, వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆర్ఐఏ నొవొస్టి వార్తా సంస్థ కథనం ప్రకారం.. ‘‘టార్టస్, హుమాయ్‌మిమ్‌ల్లోని రష్యా గగనతల రక్షణ వ్యవస్థ పహారా కాస్తున్న జోన్‌లోకి అమెరికా, దాని మిత్రదేశాలు విడుదల చేసిన క్రూయిజ్ మిస్సైళ్లు ఏవీ రాలేదు’’ అని ఒక ప్రకటన పేర్కొంది.
2015లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌కు మద్దతుగా రష్యా వాయుసేన చర్యలు చేపట్టింది. సిరియాలో జరుగుతున్న యుద్ధం ప్రభుత్వానికి అనుకూలంగా మారటంలో రష్యా చర్యలు కీలకపాత్ర పోషించాయి.
నిగ్రహం పాటించండి: ఐక్యరాజ్యసమితి

ఫొటో సోర్స్, Reuters
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు జరుపుతున్న దాడుల వార్తల్ని తాను చూస్తున్నానని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాల్లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఉన్నాయి. ‘నిరంతరం ఐక్యరాజ్యసమితి ఛార్టర్, అంతర్జాతీయ న్యాయ నిబంధనలకు అనుగుణంగా’ ప్రవర్తించాల్సిన బాధ్యత ఈ దేశాలపై ఉందని ఆయన చెప్పారు.
‘భద్రతా మండలి ప్రధాన బాధ్యత ప్రపంచ శాంతి, భద్రతల్ని పరిరక్షించటం. భద్రతా మండలి దేశాలన్నీ ఐక్యమై, తమ బాధ్యతల్ని నిర్వర్తించాలి’ అని ఆయన తెలిపారు.
‘ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో అన్ని సభ్య దేశాలూ నిగ్రహం పాటించాలని కోరుతున్నాను. పరిస్థితుల్ని మరింత దిగజార్చే, సిరియా ప్రజల బాధల్ని ఎక్కువచేసే చర్యలకు పాల్పడవద్దు’ అన్నారు.
సిరియాలో రసాయన ఆయుధాలు వాడారన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే అంశంపై భద్రతా మండలి విఫలం కావటం పట్ల గుటెర్రస్ ‘తీవ్ర అసంతృప్తి’ వ్యక్తం చేశారు. గురువారం భద్రతా మండలి సమావేశంలో విచారణ సంస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై అమెరికా, రష్యాలు పరస్పరం వీటో అధికారంతో తోసిపుచ్చాయి.
సిరియా ప్రజలకు హాని జరగొద్దు: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
సిరియా పౌరులను రక్షించాలని అమెరికా, దాని మిత్ర దేశాలకు మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సూచించింది.
‘రసాయన దాడి’పై విచారణ ప్రారంభం
'రసాయన ఆయుధాల నిషేధ సంస్థ(ఓపీసీడబ్ల్యూ)' డ్యూమాలో ఈనెల 8వ తేదీన జరిగిన అనుమానాస్పద ‘రసాయన దాడి’పై విచారణ ప్రారంభించింది.
రసాయన దాడి అంటూ అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్న డౌమా దాడిపై నిజ నిర్థారణ జరిపేందుకు ఒక బృందాన్ని పంపిస్తున్నట్లు ఏప్రిల్ 10వ తేదీన ఓపీసీడబ్ల్యు సంస్థ ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
దాడులు ‘రాయబారాన్ని భర్తీ చేయలేవు’
రాజకీయ వ్యూహంలో భాగమైనప్పుడే సైనిక చర్య విజయవంతమవుతుందని బ్రిటీష్ విదేశాంగ మాజీ కార్యదర్శి డేవిడ్ మిలిబంద్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
దాడులు జరుగుతాయని రష్యా ముందే చెప్పింది: సిరియా
అమెరికా, దాని మిత్రపక్షాల దాడుల నేపథ్యంలో తమ సైనిక స్థావరాలన్నింటినీ ముందే ఖాళీ చేయించినట్లు సిరియా ప్రభుత్వం తెలిపింది. దాడులు జరుగుతాయని రష్యా తమను ముందస్తుగా హెచ్చరించిందని, దీంతో కొన్ని రోజుల కిందటే సైనిక స్థావరాలను ఖాళీ చేయించామని సిరియా అధికారి ఒకరు 'రాయిటర్స్' వార్తాసంస్థతో చెప్పారు. సుమారు 30 క్షిపణులు సిరియాపై ప్రయోగించారని, దాదాపు పది క్షిపణులను తాము కూల్చివేశామని వెల్లడించారు.
దాడుల వల్ల ఎంత నష్టం జరిగిందో అంచనా వేస్తున్నామని సిరియా చెప్పింది.
అంతర్జాతీయ చట్టం ఉల్లంఘన: సిరియా ప్రభుత్వ మీడియా
తమ దేశంలో అమెరికా, దాని మిత్రపక్షాలు వైమానిక దాడులు జరపడం అంతర్జాతీయ చట్టాన్ని బాహాటంగా ఉల్లంఘించడమేనని సిరియా ప్రభుత్వ మీడియా ఆరోపించింది.
సిరియాలో ఉగ్రవాదులు విఫలమయ్యారని, సిరియా వ్యవహారాల్లో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ జోక్యం చేసుకొని దాడులకు పాల్పడ్డాయని, వాటి యత్నం విఫలమవుతుందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అధికార వార్తాసంస్థ సనా చెప్పింది.
రాజధాని డమాస్కస్‌కు ఈశాన్యాన ఒక పరిశోధన కేంద్రంపైన, రాజధాని చుట్టుపక్కల ఉన్న సైనిక స్థావరాలపైన దాడులు జరిగాయని సనా తెలిపింది. హమ్స్ నగరంలోని సైనిక ఆయుధాగారాలు లక్ష్యంగా ప్రయోగించిన క్షిపణులను నిరోధించినట్లు చెప్పింది.
‘అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ చర్యలకు మద్దతు’: నాటో ఛీఫ్
పాశ్చాత్య దేశాల దాడులు ‘‘రసాయన ఆయుధాలు ఉపయోగించి సిరియా ప్రజలపై మరిన్ని దాడులు చేయకుండా (అసద్) ప్రభుత్వ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి’ అని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టొల్టెన్‌బెర్గ్ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
‘ఆకాశంలో అల్లకల్లోలం’: డమాస్కస్ వాసి
‘‘మాపైన (ఆకాశంలో) అల్లకల్లోలంగా ఉంది. చాలా క్షిపణులు నేలకూలాయి’’ అని సిరియా రాజధాని డమాస్కస్ నివాసి ఒకరు బీబీసీ ప్రతినిధి రియామ్ డలాటికి తెలిపారు.
శనివారం ఉదయం 20కి పైగా యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైళ్లు ప్రయోగించటం తాము చూశామని వెల్లడించారు.
‘అవి చాలా ఎత్తుకు ఎగిరి.. ఏదో లక్ష్యాన్ని వెంటాడుతున్నట్లు గింగిరాలు తిరిగాయి. క్రూయిజ్ మిస్సైళ్లు నాకు కనిపించలేదు. కానీ, కొన్ని శకలాలు పడటం మాత్రం చూశాను’ అన్నారు.
‘వ్యూహం ఏది ట్రంప్?’: అమెరికా సెనేటర్లు
రిపబ్లికన్ సెనేటర్ జాన్ మెక్‌కెయిన్ డొనాల్డ్ ట్రంప్ చర్యల్ని ప్రశంసించారు. అయితే, సమగ్ర వ్యూహం ఉండాలని హెచ్చరించారు.
సిరియాలో కీలక ప్రదేశాలు.. దాడులు జరుగుతున్న ప్రాంతాలు

‘గగనతల రక్షణ క్షిపణుల ప్రయోగం’
శనివారం ఉదయం సిరియా రాజధాని డమాస్కస్ నగరంలో ‘గగనతల రక్షణ క్షిపణులు’ కనిపించాయని ఒక వీడియోను బీబీసీ ప్రతినిధి రియామ్ దలాటి ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
'ముందస్తు పథకాన్ని అమలు చేస్తున్నారు': రష్యా
పాశ్చాత్య శక్తులు ‘ముందస్తు వ్యూహాన్ని’ ఇప్పుడు అమలు చేస్తున్నాయని అమెరికాలో రష్యా రాయబారి అనటొలీ అంటొనొవ్ ట్విటర్ పోస్ట్‌లో ఆరోపించారు.
‘‘మరోసారి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇలాంటి చర్యలకు ప్రతిచర్యలు ఉంటాయని మేం హెచ్చరించాం’’ అని ఆయన పేర్కొన్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘కించపరుస్తున్నార’ని ఆయన ఆరోపించారు. ఒక టీవీ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆమోదయోగ్యం కాదు, వీలుకాదు’ అని చెప్పారు.
‘‘అత్యధిక రసాయన ఆయుధాలు కలిగి ఉన్న అమెరికాకు ఇతర దేశాలను నిందించే నైతి హక్కు లేదు’’ అని ఆయన తెలిపారు.
దాడులకు కెనడా ప్రధాని మద్దతు
సిరియాపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ జరుపుతున్న దాడులకు కెనడా ప్రధాని ట్రూడో మద్దతు ప్రకటించారు.
‘రసాయన ఆయుధాల వాడకాన్ని’ కెనడా ఖండిస్తోందని ఆయన పేర్కొన్నారు.
కెనడా ప్రభుత్వ ప్రసార సంస్థ సీబీసీ న్యూస్ ట్వీట్ ప్రకారం.. అంతర్జాతీయ భాగస్వాములతో కలసి కెనడా పనిచేస్తుందని ట్రూడో చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 11
‘పార్లమెంటుకు చెప్పకుండా దాడులా!!’ ట్రంప్‌పై విమర్శలు
సిరియాపై దాడులు చేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే.. అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు)ను సంప్రదించకుండానే దాడులకు అనుమతి ఎలా ఇస్తారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై స్వపక్ష, విపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి.
‘నిర్లక్ష్యపూరిత’, ‘అక్రమ’ దాడులు అని డెమొక్రటిక్ సెనేటర్ టిమ్ కైన్ వీటిని అభివర్ణించారు. ఇరాన్, ఉత్తర కొరియాలపై బాంబులు వేసే ధైర్యాన్ని ఈ దాడులు ట్రంప్‌కు ఇవ్వొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్ నాయకుడు థామస్ మస్సీ స్పందిస్తూ.. ఈ దాడులు రాజ్యాంగేతరమని అన్నారు.
అయితే, న్యాయ నిపుణులు మాత్రం ఈ అంశంపై విబేధిస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌లో సిరియాపై పరిమిత దాడులకు ట్రంప్ ఆదేశించినప్పటి నుంచి ఈ అంశంపై చర్చ జరుగుతోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 12

పోస్ట్ of X ముగిసింది, 13
శనివారం ఉదయం పరిణామాలు (భారత కాలమానం ప్రకారం)
రంగంలోకి ఫ్రెంచి జెట్ విమానాలు
సిరియాలో దాడులు చేయటానికి బయలుదేరిన యుద్ధ విమానాల వీడియోను ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 14
డమాస్కస్‌లో భారీ పేలుళ్ల శబ్ధాలు
శనివారం తెల్లవారుజామున సిరియా రాజధాని నగరం డమాస్కస్‌లో భారీ పేలుళ్ల శబ్ధాలు విన్నట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థకు చెప్పారు. కనీసం ఆరు భారీ పేలుళ్లు జరిగాయని, ఆకాశంలో పొగ ఎగబడటం కూడా చూశానని తెలిపారు.
ఉత్తర బార్జా జిల్లాపై కూడా పేలుళ్లు జరిగినట్లు మరొక సాక్షి చెప్పారు.
సిరియా ప్రభుత్వ సైంటిఫిక్ స్టడీస్ అండ్ రీసెర్చి సెంటర్ (ఎస్ఎస్ఆర్సీ) శాఖ బర్జాలో ఉంది.
బర్జా స్థావరంలో రసాయన ఆయుధాలను తయారు చేస్తున్నట్లు తాము నమ్ముతున్నామని పాశ్చాత్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒకటి బీబీసీకి తెలిపింది. బర్జా స్థావరంతో పాటు డమ్మర్ జిల్లా, హమా ప్రావిన్సుల్లోని స్థావరాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతోందని వెల్లడించింది.

ఫొటో సోర్స్, Reuters
మహిళలు, చిన్నపిల్లల ‘ఊచకోత’: మేక్రాన్
‘‘రసాయన ఆయుధాలతో పదుల సంఖ్యలో మహిళలు, పిల్లలు, ప్రజలను ఊచకోత కోశార’’ని, అందుకే సిరియాపై దాడులకు ఆదేశించామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మేక్రాన్ తెలిపారు. ‘హద్దు మీరారు’ అని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 15
‘రసాయన దాడి’: అసలేం జరిగింది?
ఏప్రిల్ 8వ తేదీన డ్యూమాలో జరిగినట్లు అనుమానిస్తున్న ‘రసాయన దాడి’లో 40 మందికి పైగా చనిపోయినట్లు సిరియా విపక్ష కార్యకర్తలు, సహాయ చర్యల సిబ్బంది, వైద్య సిబ్బంది చెబుతున్నారు.
దాడి బాధితుల నోటిలో నురగ కనిపించిందని సిరియా సివిల్ డిఫెన్స్, సిరియన్ అమెరికన్ మెడికల్ సొసైటీ సంస్థలు చెప్పాయి. బాధితుల చర్మం, పెదవులు నీలి వర్ణంలోకి మారిపోయాయని తెలిపాయి. బాధితుల కార్నియా (కంటిలోని ఒక భాగం) దెబ్బతిందని వివరించాయి.
అసద్ ప్రభుత్వం రసాయన ఆయుధాలు వాడినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఫ్రాన్స్ చెప్పింది. క్లోరిన్ అయితే కచ్చితంగా వాడారని తెలిపింది.
సిరియా ప్రభుత్వం, రష్యా ఈ ఆరోపణల్ని తోసిపుచ్చాయి.
దేశ రాజధాని డమాస్కస్ సమీపంలో తూర్పూ ఘూటా ప్రాంతంలో తిరుగుబాటుదారుల నియంత్రణలోని ఏకైక నగరం డ్యూమా.

ఫొటో సోర్స్, AFP
డ్యూమా దాడికి పాల్పడింది మనిషి కాదు, ‘రాక్షసుడు’
డ్యూమాలో ఏప్రిల్ 8వ తేదీన అనుమానిత రసాయన దాడికి పాల్పడింది మనిషి కాదని, ‘రాక్షసుడు’ అని ట్రంప్ చెప్పారు.
సిరియా అధ్యక్షుడు అసద్‌కు మద్దతు ఇస్తున్నవారు ఎవరివైపు నిలబడుతున్నారో ఆలోచించుకోవాలని ట్రంప్ సూచించారు.
రష్యా ఒక ‘దుష్ట దేశం’ అని ట్రంప్ అభివర్ణించారు. ‘‘ఊచకోతలకు పాల్పడే హంతకుడితో జట్టు కట్టాలని ఏ దేశం కోరుకుంటుంది?’’ అని ఆయన ప్రశ్నించారు.
కాగా, డ్యూమాలో రసాయన దాడి జరిగినట్లుగా బ్రిటన్ సాయంతో అమెరికా కట్టుకథ అల్లిందనే తిరుగులేని ఆధారం తమ వద్ద ఉందని శుక్రవారం రష్యా తెలిపింది. అయితే, ఈ ఆరోపణను బ్రిటన్ నిర్ద్వంద్వంగా ఖండించింది. అదొక పచ్చి అబద్ధం అని కొట్టిపారేసింది.

ఫొటో సోర్స్, Getty Images
‘దాడులకు ప్రత్యామ్నాయం లేదు’: థెరిసా మే
దాడుల్లో బ్రిటన్ పాల్గొంటున్న విషయాన్ని ప్రధాని థెరిసా మే ధృవీకరించారు. ‘‘సైనిక దళాలను ఉపయోగించకుండా ఉండేందుకు ఆచరణాత్మక ప్రత్యామ్నాయం ఏమీ లేదు’’ అని ఆమె అన్నారు.
ఈ దాడులు సిరియాలో ‘‘అధికార మార్పు’’కు కాదని ఆమె తెలిపారు.
‘రసాయన ఆయుధాల వినియోగాన్ని నిరోధించేందుకే’ - ట్రంప్
తాము చేపట్టిన ఈ దాడులు రసాయన ఆయుధాలను వినియోగించకుండా సిరియాను నిరోధిస్తాయని ట్రంప్ చెప్పారు.
రసాయన ఆయుధాల ఉత్పత్తి, వినియోగం, విస్తృతికి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రతిబంధకం ఏర్పాటు చేయటమే ఈ దాడుల లక్ష్యమని ట్రంప్ అన్నారు. ఈమేరకు జాతిని ఉద్దేశించి ఆయన ప్రకటన చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
సిరియాపై దాడులకు ట్రంప్ ఆదేశాలు
ఫ్రాన్స్, బ్రిటన్‌లతో కలసి సిరియాపై సైనిక చర్య చేపట్టేందుకు బలగాలకు అనుమతి ఇచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.
సిరియాలోని డ్యూమాలో ఏప్రిల్ 8న జరిగిన అనుమానిత రసాయన దాడికి ప్రతిగా ఈ దాడులు ప్రారంభమయ్యాయి.
‘‘ఫ్రాన్స్, బ్రిటన్ సైనిక దళాలతో కలిసి సంయుక్త ఆపరేషన్ ఇప్పుడు జరుగుతోంది’’ అని డొనాల్డ్ ట్రంప్ జాతిని ఉద్దేశించి చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
బషర్ అల్-అసద్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘‘రసాయన ఆయుధాలకు సంబంధించిన స్థావరాలు’’ లక్ష్యంగా దాడులకు తాను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.
సిరియా రాజధాని డమాస్కస్ సమీపంలో పేలుళ్లు జరిగినట్లు నివేదికలందాయి.
సిరియా ‘రసాయన దాడి’ అంశంపై బీబీసీ ప్రత్యేక కథనాలు.. మీకోసం:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)