సిరియా: ప్రమాదంలో పసి పిల్లలు
తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న డమాస్కస్ శివారు, ఘూటా నుంచి, తీవ్రంగా జబ్బు పడిన చిన్నారులను స్వచ్ఛంద సంస్ధల కార్యకర్తల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
నాలుగేళ్ల దిగ్బంధనం తర్వాత తూర్పు ఘూటాలో నివసించే వారికి వైద్య అవసరాలు తీవ్రస్ధాయికి చేరుకున్నాయి. ఆహారం, మంచి నీళ్ళు, ఇంధనం.. అన్నిటికీ కొరత ఉంది.
ఇప్పుడు తగ్గిన ఉష్ణోగ్రతలతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కేన్సర్‌తో బాధ పడుతున్న ఏడుగురు చిన్నారులను తరలించేందుకు అనుమతించాలని.. గత వారం.. అంతర్జాతీయ సహాయ సంస్థల ప్రతినిధులు అధ్యక్షుడు అసాద్ ను అభ్యర్ధించారు.
ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)