మెడిటేషన్‌తో మెదడు ఆకారంలో సానుకూల మార్పులు

ఫొటో సోర్స్, Getty Images
ఏదైనా ఒక పనిని వాయిదా వేయడం, లేదా వేయకపోవడం అనేదానికి సమాధానం మన మెదడు ఎంత ఆందోళనగా ఉంది అనే దానిలోనే ఉందని ఒక అధ్యయనం చెబుతోంది.
ఒక పనిని చేయాలా లేక దానిని పక్కన పెడదామా అనే విషయాన్ని మెదడులో ఉన్న రెండు భాగాలు నిర్ణయిస్తాయని పరిశోధకులు ఒక సర్వే ద్వారా గుర్తించారు.
ఈ సర్వే కోసం 264 మందికి చేసిన స్కానింగ్ రిపోర్టులను పరిశీలించారు. ఏదైనా పని చేయడానికి వారు ఎంత చొరవ తీసుకుంటారు అనేది గమనించారు.
సైకలాజికల్ సైన్స్ అధ్యయనంలో ఒక పనిని వాయిదా వేయడం అనేది వారి భావోద్వేగాల నియంత్రణను అధిగమించిందని వారికి తెలిసింది.
మన మెదడులో భావోద్వేగాలను, ప్రేరణను కలిగించే బాదంపప్పు ఆకారంలో ఉండే అమిగ్డలా దీనికి కారణమని పరిశోధకులు గుర్తించారు. చెవి తమ్మెకు, కణతకు దగ్గరగా ఉండే ఇది, పనులు వాయిదా వేసేవారిలో పెద్దదిగా ఉంటుందని అంటున్నారు.
వాయిదా వేసే అలవాటు ఉన్న వారిని పరిశీలించినపుడు వారి అమిగ్డలా, మెదడులోని డోరసల్ అంటీరియర్ సింగులేట్ కోర్టెక్స్(డీఏసీసీ) అనే భాగం మధ్య సంబంధాలు చాలా బలహీనంగా ఉన్నట్టు గుర్తించారు.
అమిగ్డలా నుంచి అందే సమాచారాన్ని డీఏసీసీ ఉపయోగిస్తుంది. శరీరం ఏ పనిని చేయాలో నిర్ణయిస్తుంది. అది ఒక వ్యక్తిని భావోద్వేగాలు, పరధ్యానాన్ని అడ్డుకుని తన పనిని కొనసాగించేలా చేస్తుంది.
"అమిగ్డలా పెద్దదిగా ఉన్న వ్యక్తులు తాము చేసే పని వల్ల ఏదైనా జరగరానిది జరుగుతుందేమో అని ఎక్కువ ఆందోళనకు గురవుతారు. వాటిని చేయడానికి వెనకాడుతారు, చేతిలోని పనులు పక్కన పెట్టేస్తారు" అని బోచమ్ యూనివర్సిటీకి చెందిన అధ్యయన వేత్త ఎర్హాన్ జెంక్ చెప్పారు.
పనులు వాయిదా వేసే అలవాటు ఉన్న వారు భావోద్వేగాలు, పరధ్యానం ఏర్పడకుండా పెద్దగా అడ్డుకోలేరు. ఎందుకంటే పని చేయాలనే చొరవ తీసుకునే వారి కంటే వీరి మెదడులో అమిగ్డలా, డీఏసీసీ మధ్య సంబంధాలు చాలా బలహీనంగా ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
లక్ష్యసాధనపై అదుపు
ఒట్టావాలోని కార్ల్‌టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టిమ్ పైచిల్.. పనులు వాయిదా వేసే ఈ అలవాటుపై గత కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. టైం గురించి పట్టించుకోకుండా, భావోద్వేగాలను నియంత్రించాలని అనుకోవడం వల్లే వారిలో ఇలాంటి సమస్య వస్తోందని ఆయన భావిస్తున్నారు.
అన్నీ వాయిదా వేస్తూ వెళ్లే వారిలో, భావోద్వేగాల నియంత్రణ వల్లే ఈ సమస్య అనడానికి ఈ అధ్యయనం సైకలాజికల్ ఆధారాలు అందించిందని ఆయన చెప్పారు.
మెదడులో భావోద్వేగాల కేంద్రాలు ఒక వ్యక్తి స్వయం-నియంత్రణ సామర్థ్యాన్ని ఎలా అధిగమిస్తాయో ఈ పరిశోధన బయటపెట్టింది.
మెదడులోని ఈ స్థితిని మార్చగలమని అనుకుంటున్నామని డాక్టర్ పైచిల్ తెలిపారు. ధ్యానం చేయడం వల్ల అమిగ్డలాను చిన్నగాచేసి, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ వృద్ధి చేయవచ్చని, అది ఈ రెండు భాగాల మధ్య సంబంధాలను బలంగా చేస్తుందని పరిశోధనలో ఇప్పటికే తేలిందని ఆయన చెప్పారు.
ఈ పరిశోధన మెదడులో మార్పులు చేయడం సాధ్యమేనని చూపిస్తోందని ఆయన తెలిపారు.
"మెదడు చాలా ప్రతిస్పందనతో ఉంటుంది, దాన్ని మనం మన జీవితకాలం అంతా మార్చుకోవచ్చు. అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ కరోలిన్ ష్లటర్.. తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
వాయిదా వేసేవారికి కొన్ని టిప్స్
మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి వ్యక్తిత్వాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలని నిపుణులు మోయ్రా స్కాట్ బావిస్తున్నారు.
మనం ఒక పనిని ఎప్పుడు వాయిదా వేస్తున్నామో గుర్తించాలి, ఆ పనిని చేసేలా మనల్ని మనం సిద్ధం చేసుకోడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయని చెప్పారు.
టాప్ టిప్స్:
- మీకు ఒక డెడ్‌లైన్ అంటూ లేకుంటే, మీరు నియమిత కాలంపై దృష్టి పెట్టేలా ఒక టైమర్ ఉపయోగించాలి. ఉదాహరణకు. 5 నిమిషాల విరామంతో ఒకేసారి 25 నిమిషాలు పనిచేయాలి. ప్రతి 90 నిమిషాలకూ ఒక పెద్ద విరామం తీసుకోవాలి.
- మీరు చేయాలనుకున్న పనుల జాబితా రాసుకోవాలి. కానీ అవి చిన్నవిగా, నిర్దిష్టంగా ఉండేలా వేరు చేయాలి. అలా ఒక్కో పనిని పూర్తి చేయడం సులభంగా ఉంటుంది.
- ఈమెయిల్ నోటిఫికేషన్స్ లాంటి అంతరాయాలు తగ్గించుకోవాలి. మీ ఫోన్‌ను ఏరోప్లేన్ మోడ్‌లో పెట్టాలి లేదా మీకు అంతరాయం కలగని ప్రాంతాలకు వెళ్లి పని చేసుకోవడం కూడా మంచిది
- మనం తప్పించుకునే పని చేయడం కంటే బిజీగా ఉండడం సులభమే. చేతిలో ఉన్న పని చేయడానికి బదులు, వేరే పనులేవో చేస్తుంటాం, అది చేసే సమయం లేదని మనలో మనమే అనుకుంటాం. కానీ, మీ దగ్గర సమయం ఉంది, మీరు దాన్ని చేయాలి అనుకోవాలి.
ఇవికూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








