వృద్ధాశ్రమానికి పంపిస్తానన్న కొడుకును చంపిన 92 ఏళ్ల తల్లి

ఫొటో సోర్స్, MARICOPA COUNTY SHERIFF'S OFFICE
వృద్ధాశ్రమానికి పంపిస్తున్నాడనే కోపంతో అమెరికాలో ఒక 92 ఏళ్ల తల్లి తన 72 ఏళ్ల కుమారుడిని హత్య చేసిందని అక్కడి పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు.
‘అన్నా మే బ్లెసింగ్’ అనే 92 ఏళ్ల వృద్ధురాలిని ఆమె కుమారుడు కేర్ హోంలో ఉంచాలని అనుకున్నారని.. ఆ సంగతి తెలుసుకున్న ఆమె ఆగ్రహంతో హత్యకు పాల్పడినందని అభియోగ పత్రాల్లో ఉంది.
కొడుకును హత్య చేశాక ఒక దశలో తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని బ్లెసింగ్ పోలీసులకు తెలిపారు.
పోలీసు రికార్డులు, స్థానిక మీడియా ప్రకారం, జులై 2న మరికోపా కంట్రీలోని ఫౌంటెన్ హిల్స్‌లో ఈ హత్య జరిగింది.
రెండు తుపాకులు వెంట తీసుకెళ్లి..
బ్లెసింగ్ కొడుకు పేరును పోలీసులు వెల్లడించలేదు. తల్లితో కలిసి ఉండడం కష్టంగా అనిపించడంతో అతడు ఆమెను అన్ని సౌకర్యాలూ ఉన్న ఒక కేర్ సెంటర్‌లో వదిలిపెట్టాలని అనుకున్నాడు.
కుమారుడి గదిలోకి వెళ్లి ఆయనతో గొడవపడడానికి ముందు బ్లెసింగ్ తనతో పాటు రెండు తుపాకులను తీసుకెళ్లినట్లు పోలీసులు తమ రిపోర్టులో రాశారు.
అక్కడ కుమారుడితో మాటామాటా పెరగడంతో 1970లో కొన్న ఒక రివాల్వర్ బయటకు తీసిన బ్లెసింగ్ దానితో అతడిపై కాల్పులు జరిపారు. మెడ, దవడలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లడంతో అతడు చనిపోయాడని పోలీసులు తెలిపారు.
హత్య చేసిన తర్వాత ఆమె తుపాకీని కొడుకు స్నేహితురాలికి గురిపెట్టారు. అయితే.. ఆమె బ్లెసింగ్‌తో పెనుగులాడి తప్పించుకోగలిగారు.
అనంతరం ఆమె పోలీసులకు ఫోన్ చేయడంతో విషయం బయటపడింది.
‘నా జీవితాన్ని తీసుకున్నావు.. నీ ప్రాణాలు తీసుకుంటా’’
బ్లెసింగ్ దగ్గర ఉన్న రెండో తుపాకీని చనిపోయిన ఆమె భర్త 1970లో ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు.
బ్లెసింగ్ తన కుమారుడు, అతడి స్నేహితురాలితో కలిసి ఆరిజోనాలో ఒక ఇంట్లో ఉంటున్నారు. ఆయన బ్లెసింగ్‌ను తన ఇంటి నుంచి పంపించేయాలని అనుకున్నప్పుడు "నువ్వు నా జీవితాన్ని తీసుకున్నావ్, నేను నీ ప్రాణాలు తీసుకుంటా" అని అన్నట్టు తెలుస్తోంది.
హత్య తర్వాత బ్లెసింగ్ తన గదిలో ఒక వాలు కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తను చేసిన పనికి తనను చంపేయాలని ఆమె వారితో అన్నారు.
కాగా హత్య, దాడి, కిడ్నాపింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కుంటున్న బ్లెసింగ్‌కు 5 లక్షల డాలర్ల పూచీకత్తుపై బెయిలు మంజూరు చేశారు.
ఇవి కూడా చదవండి:
- థాయ్‌లాండ్ గుహలో బాలలు: రక్షించేందుకు ‘తొందరపడం, రిస్క్ తీసుకోం’ అంటున్న ప్రభుత్వం
- క్యాన్సర్‌ను ‘తినేసే’లా మానవ కణాలను బలోపేతం చేయనున్న కొత్త మందు
- చెట్లు రహస్యంగా ఎలా మాట్లాడుకుంటాయో తెలుసా?
- రష్యా ఉద్యోగులు: 'పింఛను అందే వరకు బతికే ఉంటామా'
- జైలు నుంచి హెలికాప్టర్లో పారిపోయిన దోపిడీ దొంగ
- పాస్‌పోర్ట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- జపాన్‌లో కూలీలకు బిజినెస్ సూట్లు - ఎందుకంటే..
- ఏసీలు చల్లబరుస్తున్నాయా.. లేక వేడెక్కిస్తున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








