ప్రపంచ పర్యావరణ దినం: #టూత్‌బ్రష్ ఛాలెంజ్‌కి మీరు సిద్ధమా?

ప్లాస్టిక్... ప్లాస్టిక్.. మనిషి జీవితంలో అదొక భాగమైపోయింది. ఉదయం లేవగానే వాడే టూత్ బ్రష్ మొదలుకుని రాత్రి పడుకునే దాకా.. ప్లాస్టిక్ వాడకం సాధారణమైపోయింది.

వాడి పడేసిన ప్లాస్టిక్‌ వస్తువులతో సహజవనరులన్నీ కలుషితమవుతున్నాయి.

ప్రపంచానికే పెను సవాలుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్‌ వాడకాన్ని ఆపేయాలంటూ.. ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన సెలబ్రెటీలు ప్లాస్టిక్ కాలుష్యంపై పోరాడాలంటూ తమ అభిమానులను, స్నేహితులను కోరారు.

"ఇక నుంచి మీరు రెస్టారెంటుకు వెళ్లినప్పుడు దయచేసి ప్లాస్టిక్ గ్లాసులను తిరస్కరించండి. మట్టి పాత్రలను వాడండి, ప్లాస్టిక్‌ను వదిలేయండి" అని భారత క్రికెటర్ వీరేంద్ర సేహ్వాగ్ పిలుపునిచ్చారు.

"నేను ఈ రోజు నుంచి ప్లాస్టిక్ టూత్ బ్రష్ వాడను. పర్యావరణ పరిరక్షణ కోసం ఇది నా వంతు ప్రయత్నం. మరి మీరు కూడా ఈ ఛాలెంజ్‌కి సిద్ధమా?" అంటూ అమెరికన్ గాయని బెలిందా తన స్నేహితులకు సవాల్ విసిరారు.

‘‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడించేందుకు ఉద్యమం ఉధృతమవుతోంది, మీరు కూడా భాగమవ్వండి. వీడియో లేదా ఫొటో షేర్ చేయడం ద్వారా ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడించొచ్చు’’ అని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ట్వీటర్‌లో కోరారు.

‘‘ప్లాస్టిక్ కాలుష్యంపై పోరాడేందుకు నదుల కోసం ర్యాలీలో పాల్గొంటున్నా, ఐక్యరాజ్య సమితితో చేతులు కలుపుతున్నాను. ఈ ప్రపంచంలో ప్లాస్టిక్‌ లేకుండా చేసేందుకు మీరు కూడా కలిసి వస్తారా?’’ అని నటి జుహి ఛావ్లా ట్వీట్ చేశారు.

‘‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడించేందుకు ప్రతిజ్ఞ చేద్దాం’’ అని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)