You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ గాడిద ఒకప్పుడు పెద్ద స్టార్
ఇది ఆస్కార్స్ సీజన్. లింగ వివక్ష చర్చలు, సమాన వేతన చర్చలు వాడీవేడిగా సాగుతున్నాయి. కానీ మీకు తెలుసా? ఒకప్పుడు బ్రిటన్‌లో, నాలుగు కాళ్ళ నటుడు, తన రెండు కాళ్ళ ప్రత్యర్ధి నటులకు తీవ్రమైన పోటీ ఇస్తూ, లండన్ థియేటర్లలో ప్రదర్శనలు ఇచ్చేవారు. అది ఎవరో తెల్సుకోవాలంటే 1987 నాటి బిబిసి ఆర్కైవ్స్ ను చూడండి.
రేసుల విషయానికొచ్చేసరికి కదల్లేదని అంతా చెబుతున్నా... పేరు ప్రఖ్యాతలు సంపాదించే విషయంలో మాత్రం ఈ గాడిద చాలా స్పీడు.
పదేళ్ల ప్రాయంలో లండన్ రాయల్ థియేటర్లలో ప్రదర్శితమయ్యే 'Joseph and his Amazing Technicolour Dreamcoat' మ్యూజికల్ షో లో రోజుకి రెండు సార్లు ప్రత్యక్షమయ్యేది.
అంత స్టార్ డం వచ్చినప్పుడు కచ్చితంగా అందుకు తగ్గ మూల్యం కూడా ఉంటుంది.
సిసిల్ పేరున్న ఈ గాడిద ఆక్సఫర్డ్ లోని తన సొంతంటిని వదిలేసి 60 మైళ్ల దూరంలో ఉన్న సర్రే పట్టణంలో నగరంలోని ఓ నిత్య ప్రయాణీకుడి దగ్గర నివసిస్తోంది.
తన ప్రదర్శనల తరువాత, తన ఇంటి దగ్గరున్న ఈ బార్ లో సిసిల్ ఎక్కువగా కనిపిస్తుండేది.
ఈ బార్ యజమాని, రిచర్డ్ లాయిడ్, సిసిల్ కు ఓ ఏజెంట్ మాత్రమే కాదు... ఓ రకంగా డ్రైవర్ కూడా.
’సిసిల్ చాలా గొప్పది. ఐదు చిన్న ఆడ గుర్రాలతో కలిసి ఉంటుంది. అవి సిసిల్ శుభ్రంగా ఉండేలా చూసుకుంటాయి. సిసిల్ వల్ల ఎలాంటి సమస్యా ఉండదు. కరవదు, తన్నదు. అద్భుతం. పబ్ లోని చాలా మంది కస్టమర్ల కన్నా మంచిది.‘ అని రిచర్డ్ తెలిపారు.
మరి ప్రయాణాల సమయంలో సిసిల్ ఎలా వ్యవహరిస్తుంది? అంటే..
‘మళ్ళీ ఎలాంటి సమస్యా లేదు. మా దగ్గర దానికి అనువైన పెద్ద ట్రాలీ ఉంది. దానికి అనువైన సమయాల్లోనే ప్రయాణిస్తాం. మధ్యాహ్నం వెళ్తే రాత్రికి తిరిగొస్తుంది. అలా రద్దీ సమయాల్ని తప్పించుకుంటుంది. అలాగని తక్కువ ప్రయాణమేం ఉండదు.’ అని తెలిపారు.
ఈ గాడిదకు కేరట్ అంటే మహా ఇష్టం. దాంతోనే ఊరిస్తూ సిసిల్ ను రోజూ బార్ నుంచి లండన్ లోని థియేటర్ కు ప్రయాణం చేసేలా చేస్తున్నారు. మంచు కురిసే కాలంలో కూడా.
అక్కడ నుంచి తన ప్రదర్శన ఇవ్వడానికి కాస్త దూరం ప్రయాణం చేయాలి. అక్కడ జాకబ్ పాత్రను పీటర్ లారెన్స్, జోసెఫ్ పాత్రను మైక్ హాలోవేలు పోషిస్తారు.
బోర్డుల పై నడవడానికే తాను పుట్టింది. మాతో సిసిల్ చాలా సార్లు ప్రదర్శనలిచ్చింది. తను నిజంగా ఒకప్పుడు స్టార్. హాలీవుడ్ కు పంపాలనుకున్నారు కూడా.
ఎప్పుడైనా వేదిక పైన సిసిల్ వింతగా ప్రవర్తించిందా? గాడిద ఎప్పుడైనా రంగంస్థలం పైన ఇబ్బంది పెట్టిందా? అంటే ఓ సారి ఇది అనుకోకుండా పెట్టింది. గాడిద చేసే పనులే చేసింది. మామూలుగా జోసెఫ్, నేను, ప్రత్యేకమైన ఎంట్రీ ఇవ్వడం కోసం మోటార్ బైక్ మీద వస్తాం. అది స్టేజ్ ముందుగా రౌండ్లు కొట్టి, తరువాత గాడిద చుట్టూ తిరగాలి.
అయితే, ఎవరైతే సిసిల్ కొంత ఇబ్బంది పెట్టింది అనుకుంటారో, వాళ్ళకు తన రెండో ప్రదర్శనతో అంతే సమానంగా గంటకు ఐదు వేల పౌండ్లను సంపాదించి పెట్టేది. అంటే ఆ కాలానికి దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే ఏకైక నటుడు సిసిలే అన్న మాట.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)