You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా: ‘గన్నుకు గన్నే సమాధానం’ అంటున్న డొనాల్డ్ ట్రంప్
పాఠశాలల్లో జరుగుతున్న కాల్పుల ఘటనలను నిరోధించాలంటే స్కూలు పరిసరాల్లో గన్ ఫ్రీ జోన్‌ను లేకుండా చేయాలనీ, ఉపాధ్యాయులకు గన్స్ ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
గన్స్ మూలంగా జరుగుతున్న హింసపై వైట్ హౌజ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
"సాయుధ ఉపాధ్యాయులు ఇలాంటి దాడుల్ని అడ్డుకోగలరు" అని ట్రంప్ అన్నారు.
గత వారం ఫ్లోరిడాలో జరిగిన ఘోర కాల్పుల ఘటన తర్వాత, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ ట్రంప్‌పై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రతిపాదన చేశారు.
తుపాకులు కొనుగోలు చేసే వారి నేపథ్యాన్ని సరిగ్గా పరిశీలించాలంటూ వస్తున్న విజ్ఞప్తులను కూడా రిపబ్లికన్ ప్రెసిడెంట్ ట్రంప్ సమర్థించారు.
ఫ్లోరిడా దాడిలో బతికి బయటపడిన వారు, వారి కుటుంబ సభ్యులు గన్ కంట్రోల్ కోసం ముందుకు రావాలంటూ ఫ్లోరిడా ప్రజా ప్రతినిధులను కోరారు.
ట్రంప్ ఏమన్నారు?
బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మెజరరీ స్టోన్‌మేన్ డగల్ హైస్కూలు విద్యార్థులతో మాట్లాడుతూ ట్రంప్, "మేం గన్స్ కొనుగోలు చేసే వాళ్ల నేపథ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం. వాళ్ల మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటాం" అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని టీవీలో ప్రసారం చేశారు.
"ఇకపై గతంలో జరిగినట్టు జరగదు. ఇప్పటికే చాలా కాల్పుల ఘటనలు జరిగిపోయాయి. దీనిని ఇక అంతం చేయాల్సిందే."
గన్ లాబీయింగ్ సంస్థ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ) చాలా కాలంగా చేస్తున్న ప్రతిపాదనకు ట్రంప్ మద్దతు పలికారు.
స్కూలు టీచర్లకు, ఇతర సిబ్బందికి తుపాకులివ్వాలనే డిమాండ్‌ను ట్రంప్ చాలా 'బలంగా' సమర్థించారు.
"తుపాకులను ఉపయోగించడంలో నైపుణ్యం ఉన్న టీచర్లుంటే ఇలాంటి దాడులను వెంటనే అడ్డుకోవచ్చు" అని ట్రంప్ అన్నారు.
గన్-ఫ్రీ జోన్‌వై విమర్శ
అయితే ఉపాధ్యాయులకు తుపాకులివ్వాలనే పథకం వివాదాస్పదమైందని ట్రంప్ అంగీకరించారు. స్కూళ్లలో గన్-ఫ్రీ జోన్ పట్ల కూడా ఆయన అభ్యంతరం తెలిపారు.
"గన్ ఫ్రీ జోన్ అనేది పిచ్చితనమే. ఎందుకంటే, పిరికివాళ్లు లోపలికి జొరబడి కాల్పులు జరిపేందుకు అవకాశం ఉంటుంది" అని ట్రంప్ అన్నారు.
దాదాపు 40 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు హృదయాలను కలచివేసేలా మాట్లాడిన మాటల్ని ట్రంప్ విన్నారు.
ట్రంప్ పాల్గొన్న ఈ సమావేశానికి ముందు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది విద్యార్థులు వాషింగ్టన్‌లో ర్యాలీ నిర్వహించారు.
మరోవైపు, ఫ్లోరిడా షూటింగ్‌లో క్షేమంగా బయటపడిన వారు ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధులను కలిసి అస్సాల్ట్ రైఫిళ్ల విక్రయంపై నియంత్రణ విధించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- కొలరాడో కాల్పుల్లో పోలీసు అధికారి మృతి
- ముస్లిం పాలకులు విదేశీయులైతే మరి మౌర్యులు?
- రాజ్యాంగం నుంచి ‘సెక్యులర్’ పదాన్ని తొలగించడం సాధ్యమేనా?
- ట్రంప్‌కి బీపీ ఎంత?
- ట్రంప్: నా మానసిక పరిస్థితికేం ఢోకా లేదు!
- అసలు న్యూక్లియర్ బటన్ ట్రంప్ వద్దే ఉంటుందా?
- ట్రంప్ ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- ట్రంప్-పుతిన్ సమర్పించు రాజకీయ డ్రామా!
- అమ్మాయిలు నలుగురిలో చెప్పుకోలేని ఆ విషయాలు!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)