గ్రామీ అవార్డులు: ఎర్ర తివాచీపై తెల్ల గులాబీలు

    • రచయిత, మార్క్ సవగె
    • హోదా, బీబీసీ మ్యూజిక్ రిపోర్టర్

సినీ పరిశ్రమతోపాటు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, అసమానతలు, అన్యాయాలను ఎదుర్కొని, బాధితులకు అండగా నిలిచేందుకు హాలీవుడ్ సెలబ్రిటీలు ప్రారంభించిన #TimesUp ఉద్యమానికి పలువురు ప్రముఖ గాయనీగాయకులు మద్దతు తెలిపారు.

అందుకోసం న్యూయార్క్‌లో జరిగిన 2018 గ్రామీ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో తెల్లని గులాబీలను ధరించి ఎర్రతివాచీపై నడిచారు.

"ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి చైతన్యం రావడం గొప్పవిషయం. ఎక్కువ గొంతులు కలిస్తేనే.. అదో బలమైన శక్తిగా మారుతుంది" అని ప్రముఖ ఇంగ్లిష్ గాయని, నటి రీటా ఓరా అన్నారు.

గ్రామీ అవార్డుల వేదికపై అమెరికన్ గాయని కమిల కబెల్లో ఇలా తెల్ల గులాబీతో కనిపించారు.

పాప్ గాయని పింక్.. ఆమె భర్త, కుమార్తె, తల్లితో కలిసి హాజరయ్యారు.

#TimesUp ఉద్యమానికి మద్దతు తెలిపిన పురుష సెలబ్రిటీల్లో గాయకుడు సామ్ స్మిత్ ఒకరు.

తెల్ల గులాబీ డిజైన్ ఎంబ్రాయిడింగ్ చేసిన సూటు ధరించి పాప్ స్టార్ కేషా గ్రామీ వేడుకకు హాజరయ్యారు. #TimesUp ఉద్యమాన్ని ప్రతిబింబించే విధంగా ఆమె ఓ పాటను పాడనున్నారు.

గ్రామీ అవార్డు గెలుచుకోనున్న ఉత్తమ మహిళా రాపర్ ఈమే అవుతుందని అంటున్నారు.

ఉత్తమ నూతన నటి అవార్డు గెలుచుకున్న అలెస్సి కారా (ఎడమ), రెండోసారి గర్భం దాల్చిన తన భార్యతో అమెరికన్ సింగర్ జాన్ లెజెండ్ (కుడి)

#TimesUp ఉద్యమానికి అన్నా కెండ్రిక్, కెల్లీ క్లార్క్‌సన్ తమ మద్దతు ప్రకటించారు.

తెల్ల గులాబీని నోట్లో పెట్టుకుని కమెడియన్ సారా సిల్వర్‌మన్ ఇలా కనిపించారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)