సుబ్బులక్ష్మి గురించి నెహ్రూ: ఆమె ముందు నేనెంత.. నేను కేవలం ప్రధానమంత్రిని, ఆమె సంగీత ప్రపంచ మహారాణి

సంగీత ప్రపంచానికి మకుటం లేని మహారాణిగా ఎన్నో అవార్డులను ఎంఎస్ సుబ్బులక్ష్మి సొంతం చేసుకున్నారు. టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా కూడా ఆమె సేవలందించారు. తెలుగు నేలపై ప్రముఖంగా వినిపించే వేంకటేశ్వర సుప్రభాతం పాడింది కూడా ఆమే.