ట్రంప్ పక్కా అబద్ధాలకోరు: రిపబ్లికన్ సెనేటర్

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సొంత పార్టీ నేత, టెన్నెసీ రాష్ట్ర సెనేటర్ బాబ్ కార్కర్ తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్ పక్కా అబద్ధాలకోరు అని ఆయన అభివర్ణించారు.
టీవీలకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఆయన చెప్పేవన్నీ పూర్తిగా అబద్ధాలేనని కార్కర్ ధ్వజమెత్తారు. అంతర్జాతీయ సమాజంలో అమెరికా ప్రతిష్ఠను ట్రంప్ దిగజార్చారని మండిపడ్డారు.
అందుకు ట్రంప్ కూడా అదేస్థాయిలో ప్రతిస్పందించారు. మళ్లీ ఎన్నికల్లో గెలవలేని అత్యంత 'బలహీన' సెనేటర్ కార్కర్ అంటూ ట్విటర్‌లో ఎద్దేవా చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రిపబ్లికన్ పార్టీ ప్రతిపాదిస్తున్న పన్ను సంస్కరణలపై ఏకాభిప్రాయం సాధించేందుకు అధ్యక్ష కార్యాలయం ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో పార్టీకి చందిన అధ్యక్షుడు, సెనేటర్ పరస్పరం విమర్శలు సంధించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
నిజానికి ట్రంప్, కార్కర్ ఇద్దరూ మంగళవారం క్యాపిటల్ హిల్‌లో సమావేశం కావాల్సి ఉంది.
ట్రంప్ పరుష పదజాలంతో కూడిన ట్వీట్లు చేసిన తర్వాత కార్కర్ మళ్లీ స్పందించారు. "ప్రపంచ వ్యాప్తంగా అమెరికాకు మేలు చేసేలా ఉన్న బంధాలను ట్రంప్ విచ్ఛిన్నం చేశారు. దేశ ప్రతిష్ఠను క్షీణింపజేశారు. మళ్లీ అవకాశం వస్తే అధ్యక్షుడిగా ట్రంప్‌కి మద్దతు ఇవ్వను’’ అని సీఎన్‌ఎన్‌తో పేర్కొన్నారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




