మునుగోడు: ‘ఉప ఎన్నికకు రూ.900 కోట్లు ఖర్చంట.. ఆ డబ్బుతో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చు’

వీడియో క్యాప్షన్, మునుగోడు: డబ్బు, మద్యం ఏరులుగా పారుతున్నాయి.. కానీ తాగు నీరు, సాగు నీరు మాత్రం లేవు..

తాగడానికి నీళ్లు కావాలని అడుగుతుంటే తాగమంటూ మందు పోస్తే ప్రయోజనం ఏముంటుంది అంటున్నారు మునుగోడు ప్రజలు.

మునుగోడు బైపోల్‌కు పెట్టే ఖర్చుతో తమ సమస్యలు తీరిపోతాయని.. కానీ తమ గోడు పట్టించుకునే నాధుడే కరువయ్యాడని వాపోతున్నారు.

మరోవైపు పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్న అభ్యర్థులు ప్రజలకు వాగ్దానాల జల్లులు కురిపిస్తున్నారు.

మరి మునుగోడు ప్రజానాడి ఎలా ఉంది? అక్కడి ప్రజలేముంటున్నారు?

చిరకాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులు ఏ మేరకు పూర్తయ్యాయి?

బీబీసీ ప్రతినిధులు బళ్ల సతీష్, నవీన్ కందేరి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)