ఉప్పొంగిన గోదావరి.. ‘వందేళ్లలో ఎప్పుడూ చూడనంత వరద’

వీడియో క్యాప్షన్, ఉప్పొంగిన గోదావరి.. ‘వందేళ్లలో ఎప్పుడూ చూడనంత వరద’

గోదావరి వరదల తాకిడితో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి.

కడెం, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో తగ్గడంతో కొన్ని ప్రాంతాలు తేరుకున్నాయి. కానీ కాళేశ్వరం దిగువన తెలంగాణలోని అనేక మండలాలు వరద ముంపులో కనిపిస్తున్నాయి.

అదే సమయంలో భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరు జిల్లాల్లోని వందల గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. పోలవరం ముంపు మండలాలతో పాటుగా, గోదావరి లంకలు, కోనసీమ గ్రామాల ప్రజలు భయాందోళనతో గడపాల్సి వస్తోంది.

శుక్రవారం ఉదయానికి భద్రాచలం వద్ద 2006 నాటి వరద స్థాయిని దాటినట్లు అధికారులు చెబుతున్నారు. ఉదయానికి 67.1 అడుగులతో భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి కొనసాగుతోంది.

ఈ ప్రవాహం 70 అడుగులు దాటిపోయే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 2006లో 66.9 అడుగులకు చేరుకుంది. వరద అంతకంతకు పెరుగుతుండటంతో పూర్వపు గోదావరి జిల్లాలు ప్రమాదం అంచుకు చేరుకుంటున్నాయి. చరిత్రలోనే తొలిసారిగా జులై నెలలో ఇంత పెద్ద వరదలు వచ్చినట్లు నీటి పారుదల శాఖ అధికారుల రికార్డులు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)