Rubini Gopinath: మెడలో నగలు, జడలో పువ్వులు, కట్టేది పట్టు చీర, పాడేది ర్యాప్ సాంగ్స్ – చూసి తీరాల్సిందే

వీడియో క్యాప్షన్, ఆమె చీర కట్టు, జడలో పూలే ర్యాపర్‌గా మంచి గుర్తింపు తెచ్చాయి

చెన్నైకి చెందిన రూబిని గోపినాథ్ తమ కాలేజీలో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ర్యాప్ సాంగ్ పాడదామని అనుకున్నప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్లు ఆమెను నిరుత్సాహపరిచారు.

అయినా వెళ్లి పాడారు. ఆమె పాట చూసి అక్కడున్న వాళ్లంతా షాక్ తిన్నారు.

అప్పటి నుంచి ర్యాప్‌నే కెరియర్‌గా మార్చుకొని - తన భర్తతో కలిసి మిసెస్ గో పేరుతో ఒరిజినల్ ట్రాక్‌లను రూపొందిచడం మొదలుపెట్టారు.

చీర కట్టుకుని, తలకు పువ్వులు పెట్టుకుని ర్యాప్ పాటలను పాడుతూ - అదే తనకు గుర్తింపంటోన్న రూబినీ చెబుతున్న మరిన్ని విశేషాలను ఈ కథనంలో చూద్దాం...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)