అయిదేళ్ల బాలుడు.. గుర్రం స్వారీలో ‘మగధీరుడు’
ఈ బాలుడి పేరు జోషిత్ ఛత్రపతి. వయసు ఐదేళ్లు. యూకేజీ చదువుతున్నాడు. గుర్రం ఎక్కాడంటే బీచ్ ఇసుకలోనైనా, తారు రోడ్డుపైనైనా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో దౌడ్ తీస్తాడు.
ఈ పిల్లాడు కౌబాయ్ క్యాప్ పెట్టుకుని, బీచ్‌లో గుర్రాన్ని తీసుకెళ్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. సెల్ఫీలూ తీసుకుంటారు.
జోషిత్‌కు రెండున్నరేళ్ల వయసు ఉన్నప్పుడు రేపుపోలవరం నుంచి ఒక గుర్రం తప్పించుకుని... తిమ్మాపురంలోని జోషిత్ ఇంటి వద్దకు వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆ గుర్రమే అతని లోకమైపోయింది.
అయితే వారం రోజుల్లోనే దాని యాజమాని లక్ష్మణ్ తన గుర్రం ఆచూకీ కనుక్కున్నారు. జోషిత్ గుర్రం స్వారీ చేయాలనే తపన చూసి తనకు వీలు చిక్కినప్పుడల్లా గుర్రపు స్వారీ చేయించారు.
సాధారణంగా స్వారీ నేర్చుకోవాలంటే కనీసం మూడు నెలలు పడుతుందని, కానీ జోషిత్‌కు గుర్రాన్ని కంట్రోల్ చేయడం, వేగంగా స్వారీ చేయడం నెల రోజుల్లోనే వచ్చేసిందని లక్ష్మణ్ చెప్పారు. గుర్రాన్ని కంట్రోల్ చేయడం ఎవరికైనా కష్టమేనని, ముఖ్యంగా శిక్షకుడు లేకుండా పిల్లలు ప్రయత్నించకూడదని ఆయన హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు వద్దంటూ ఎందుకీ నిరసనలు... అసలేం జరుగుతోంది?
- టెక్సస్ కాల్పులు: ప్రైమరీ స్కూల్‌పై జరిగిన దాడిలో 19 మంది పిల్లలతో పాటు 21 మంది మృతి
- వరల్డ్ థైరాయిడ్ డే: ప్రతి పది మంది భారతీయుల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు, కారణాలేంటి?
- జ్ఞాన్వాపి మసీదును శివాలయంగా మార్చవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
- పెళ్లి గిఫ్ట్‌గా టెడ్డీబేర్ పంపిన పెళ్లికూతురి అక్క మాజీ ప్రియుడు.. అందులోని బాంబ్ పేలి కళ్లు, చేతులు కోల్పోయిన పెళ్లి కొడుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

