ఆకాశం నుంచి పడిన భారీ గోళాలు, 12 గ్రామాల్లో భయంభయం

వీడియో క్యాప్షన్, ఆకాశం నుంచి పడ్డ వింత గోళాలు.. 12 గ్రామాల్లో భయం భయం..

ఆకాశం నుంచి అగ్నిగోళాలు పడ్డాయి. వీటిని చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కూడా వీటిని చూసేందుకు వచ్చారు.

గుజరాత్‌లోని 12 గ్రామాల్లో ఇలాంటివి పడ్డాయి. వడోదరా జిల్లా పోచాయి గ్రామంలోని దృశ్యం ఇది. ఆకాశం నుంచి పడిన వింత వస్తువులను చూసేందుకు చాలా మంది వచ్చారు. వడోదరా జిల్లాతో పాటు, ఆనంద్, ఖేదా జిల్లాల్లోనూ ఇలాంటి దృశ్యాలు కనిపించాయి.

మే 14న ఆనంద్ జిల్లాలోని ప్రజలు.. ఈ వస్తువులను చూసి భయపడ్డారు. అయితే, ఈ గోళాలు ఏంటన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇవి అంతరిక్ష వ్యర్థాలు లేదా క్షిపణులు, రాకెట్ల శకలాలు అయ్యుంటాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)