రూ. కోట్ల విలువైన విల్లాలు.. కళ్ల ముందే కాలి బూడిదయ్యాయి

వీడియో క్యాప్షన్, రూ. కోట్ల విలువైన విల్లాలు.. కళ్ల ముందే కాలి బూడిదయ్యాయి

మంటల్లో ఇళ్లు కాలిపోతున్నాయి.

ఒకటి కాదు, రెండు కాదు, 20 ఇళ్లు కాలిపోయాయి.

అన్నీ ఖరీదైన, విలాసవంతమైన ఇళ్లే.

అమెరికాలోని కాలిఫోర్నియా అడవుల్లో రాజుకున్న కార్చిచ్చు.. లగున నిగుల్ పట్టణంలో విధ్వంసం సృష్టించింది.

మంటలు 200 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించాయి.

ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది.

చుట్టుపక్కల ఉన్న మిగతా ఇళ్లకు ఇంత నష్టం జరిగి ఉండదని అంచనా వేస్తున్నారు.

ఈ ప్రాంతంలో ఉండే విటన్ తాను చూసిన విషయాలను చెప్పారు.

జనం ఏడుస్తూ ఒకరినొకరు వాటేసుకున్నారు.

కార్లలో వీలైనన్ని సామాన్లు పెట్టుకున్నారు.

ఇళ్లల్లోని ఖరీదైన వస్తువులను తీసుకొచ్చి కార్లలో పెట్టుకున్నట్టున్నారు.

అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

సుమారు 20 ఇళ్లు కాలిపోయాయని ఆరెంజ్ కౌంటీ అధికారి బ్రియాన్ ఫెనేసీ చెప్పారు.

ప్రభుత్వం సుమారు 100 ఇళ్లను ఖాళీ చేయించింది.

వాతావరణ మార్పుల వల్లే కాలిఫోర్నియా అడవుల్లో కార్చిచ్చు రాజుకుందని ఫెనేసీ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)