"..అలా చేస్తే ట్రాన్స్‌జెండర్లు వీధుల్లోకి వచ్చి సెక్స్ వర్కర్లుగా మారరు"
ప్రతియేటా తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో జరిగే కూవగమ్ ఉత్సవానికి ట్రాన్స్‌జెండర్స్ పెద్దఎత్తున హాజరవుతారు.
ఇది మతపరమైన పండగలాంటిదే అయినా, ఇందులో ట్రాన్స్‌జెండర్లకు అందాల పోటీలు కూడా ఉంటాయి.
ఈ అందాల పోటీలను సమీపంలోని విల్లుపురం జిల్లాలో నిర్వహిస్తారు.
గత రెండేళ్లుగా కరోన మహమ్మారి కారణంగా ఈ ఉత్సవాలు జరగలేదు.
లాక్‌డౌన్ తర్వాత ఏప్రిల్ 18న తొలిసారిగా ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.
‘‘ముందు మన తల్లిదండ్రులు మనల్ని గుర్తించాలి. అలా చేసినట్లయితే, ట్రాన్స్‌జెంటర్లు వీధుల్లోకి వచ్చి సెక్స్ వర్కర్లుగా మారాల్సిన పరిస్థితి రాదు. మేం దాని కోసమే పోరాడుతున్నాం. ట్రాన్స్ జెండర్లను అంగీకరించి, వారికి సహకారం అందించాల్సిందిగా నేను అందరు తల్లిదండ్రులను కోరుతున్నాను. ట్రాన్స్ జెండర్ పిల్లలను సంరక్షించాలని చెప్పే చట్టం ఒకటి ఉండాలి. మిగతా పిల్లల్లాగే ట్రాన్స్ జెండర్ పిల్లలను కూడా సమానంగా పెంచాలి. అదే మేం కోరుకుంటున్నాం’’ అని ఈ అందాల పోటీల్లో విజేతగా నిలిచిన ట్రాన్స్ జెండర్ మెహెందీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కేజీఎఫ్: రియల్ రాకీ భాయ్ ‘‘థంగం రౌడీ’’ ఎవరు? ఆయన్ను ‘‘జూనియర్ వీరప్పన్’’ అని ఎందుకు పిలుస్తారు?
- వర్జినిటీ: కన్నెపొర అంటే ఏంటి? అది ఎలా ఉంటుంది? మొదటిసారి సంభోగం తర్వాత దానికి ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారు?
- జానీ డెప్: 'నా పెళ్లాం నన్ను తిట్టేది, కొట్టేది': మాజీ భార్యపై రూ.380 కోట్ల పరువు నష్టం కేసు వేసిన హాలీవుడ్ హీరో
- కాకాణి Vs అనిల్: 1960ల నుంచీ నెల్లూరు రాజకీయాల్లో వర్గ పోరు చరిత్ర ఇదీ..
- అఫ్గానిస్తాన్: ‘ఒక రొట్టెముక్క అయినా కొనిస్తారా..’ అంటూ ఆశతో రోడ్లపై ఎదురు చూస్తున్న మహిళలు, పిల్లలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)