హైదరాబాద్ దళిత యువకుడి హత్య: ‘నడిరోడ్డుపై చంపుతుంటే 30 మందిలో ఒక్కరూ అడ్డుకోలేదు’

వీడియో క్యాప్షన్, హైదరాబాద్ హత్య: ‘నడిరోడ్డుపై చంపుతుంటే 30 మందిలో ఒక్కరూ అడ్డుకోలేదు’

ముస్లిం యువతి ఆశ్రీన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొన్న దళిత యువకుడు నాగరాజు హైదరాబాద్‌లో దారుణ హత్యకు గురయ్యారు.

బుధవారం(మే 4) రాత్రి 9 గంటల సమయంలో సరూర్ నగర్ మునిసిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోని పంజా అనిల్ కుమార్ గాయత్రి నగర్ కాలనీ రోడ్డుపై అందరూ చూస్తుండగా ఈ హత్య జరిగింది.

అబ్బాయి బిల్లిపురం నాగరాజు మాల కులానికి చెందినవారని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆశ్రీన్ సుల్తానా, నాగరాజు ఐదేళ్లుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారని, వారిద్దరూ ఒకే స్కూల్లో, కాలేజీలో చదువుకున్నారని వివరించారు.

ఆశ్రీన్ తండ్రి చాలా కాలం కిందటే చనిపోయారు. నాగరాజును ఆశ్రీన్ ప్రేమించడం ఆమె అన్న సయ్యద్ మొబీన్ అహ్మద్‌కు నచ్చలేదని పోలీసులు చెప్పారు. వారిద్దరినీ ఒకరికొకరు దూరంగా ఉండాలని ఆయన బెదిరించారని కూడా తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)