బ్రిటిష్ కాలంలో పెట్టిన టైమ్ జోన్ భారత్ మార్చాలా?

వీడియో క్యాప్షన్, భారత్‌లో రెండో టైం జోన్‌తో జీడీపీ మెరుగుపడుతుందా?

తాగాజా భారత్‌కు రెండో టైమ్ జోన్‌పై చర్చ జరుగుతోంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ డిమాండ్‌ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు.

ఈశాన్య ప్రాంతాలకు ప్రత్యేక టైమ్ జోన్ ఉండాల్సిన అవసరముందని, ఈ టైమ్ జోన్ భారత్ ప్రధాన భూభాగం కంటే రెండు గంటలు ముందుకు ఉంటే, చాలా విద్యుత్ ఆదా అవుతుందని, పనిచేసే సామర్థ్యం కూడా పెరుగుతుందని ఆయన అన్నారు.

జీవ గడియారంతో మనం అనుసరించే టైమ్ కూడా కలస్తే, ప్రజల ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని ఆయన వివరించారు.

అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్‌ వంటి ఈశాన్య రాష్ట్రాలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాయి. అసలు రెండో టైమ్ జోన్‌తో కలిగే ప్రయోజనాలు ఏమిటి? దీన్ని ఎందుకు కొందరు వ్యతిరేకిస్తున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)