రష్యాకు లొంగేదేలే: యుక్రెయిన్ అధ్యక్షుడు
యుక్రెయిన్ రక్షణ కోసం తమ పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోమని.. ఆయుధాలు వదిలిపెట్టబోమని ఆ దేశ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్క్సీ స్పష్టం చేశారు.
ఆయుధాలు వదిలి రష్యాకు లొంగిపోవాలని తాను సైన్యానికి సూచించినట్లు వస్తున్న వదంతులను తోసిపుచ్చుతూ ఆయన ట్విటర్ వేదికగా విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో ఈ మేరకు స్పష్టం చేశారు.
మరోవైపు.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడానని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ ట్వీట్ చేశారు.
రష్యా చేస్తున్న దాడుల గురించి మోదీకి వివరించానని జెలియన్‌స్కీ చెప్పారు. లక్ష మందికి పైగా సైనికులు తమ భూభాగంలో దాడి చేశారని, విచక్షణారహితంగా కాల్పులు జరిపారని మోదీకి చెప్పినట్లు జెలియన్‌స్కీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
భద్రతా మండలిలో భారతదేశం తమకు మద్దతు ఇవ్వాలని, రెండు దేశాలు కలసికట్టుగా ఆక్రమణదారులను ఎదుర్కోవాలని ఆయన చెప్పుకొచ్చారు.
యుక్రెయిన్ మీద రష్యా దాడులు మొదలైన తరువాత గురువారం నాడు భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. యుక్రెయిన్‌లో హింసను సత్వరమే ఆపేయాలని మోదీ రష్యా అధ్యక్షుడిని కోరారు.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- డీఫిబ్రిలేషన్ ఇచ్చి ఉంటే మంత్రి గౌతమ్ రెడ్డి ప్రాణాలు కాపాడగలిగేవారా?
- సైబర్ నేరాల ఆరోపణలతో ఒకే ఊళ్లో 31 మంది అరెస్ట్, మూడు జిల్లాలు సైబర్ మోసాలకు అడ్డాగా మారాయా-గ్రౌండ్ రిపోర్ట్
- ఫైనాన్షియల్ ప్లానింగ్ పక్కాగా ఉండాలంటే... కోటీశ్వరులు చెప్పిన 7 సూత్రాలు
- 1857 సిపాయిల తిరుగుబాటు: చపాతీలే బ్రిటిష్ పాలన అంతానికి నాంది పలికాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




