మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు, మంచు తుపానుల్లోనూ భారత సైనికుల సేవలు

వీడియో క్యాప్షన్, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు, మంచు తుపానులో పహారా కాస్తున్న భారత సైనికుడు

కశ్మీర్‌లో భారీగా మంచుకురుస్తోంది.

చాలాచోట్ల ఉష్ణోగ్రతలు మైనస్ 7, 8 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు కూడా పడిపోయాయి.

ఇలాంటి కఠిన వాతావరణంలో భారత సైనికులు సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు.

ఇలాగే మంచులో పహారా కాస్తున్న ఓ సైనికుడి వీడియో వైరల్ అయింది.

విపరీతమైన హిమపాతం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సైనికులు సాయం చేస్తున్నారు.

షోపియాన్‌లో ఓ గర్భిణిని ఆసుపత్రికి చేర్చేందుకు సైనికులు ఆమెను భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లారు.

దట్టమైన మంచులో సైనికులు పహారా కాస్తున్న మరో వీడియోను కూడా ఇండియన్ ఆర్మీ షేర్ చేసింది.

ఈ వీడియోకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)