Farmers Cricket Team: పంచె కట్టి... బ్యాట్ పట్టి.. పరుగులు కొల్లగొట్టి

వీడియో క్యాప్షన్, Farmers Cricket Team: పంచె కట్టి... బ్యాట్ పట్టి.. పరుగులు కొల్లగొట్టి

ఆదిలాబాద్ జిల్లాలో రైతులు, స్థానిక యువకులు క్రికెట్ ఆడారు.

8 ఓవర్ల ఈ మ్యాచ్‌లో యువకుల జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 8 ఓవర్లలో 59 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన రైతుల జట్టు 55 పరుగులు చేసింది.

మ్యాచ్‌లో స్వల్ప తేడాతో ఓటమి పాలైనప్పటికీ రైతుల జట్టు మాత్రం అందరినీ ఆకట్టుకుంది.

పంచెకట్టులో బ్యాట్ పట్టుకుని ఫోర్లు కొట్టిన రైతులను చూసి స్థానికులు విజిల్స్ వేశారు.

బౌలింగ్, ఫీల్డింగులో కూడా ఈ రైతులు ప్రతిభ చూపారు.

వయసులో పెద్దవారు అయినప్పటికీ, క్రికెట్ అలవాటు లేనప్పటికీ నిత్యం యువత ఆడుతుండడం చూసి వారిలా ఆడుతూ వారితోనే పోటీపడడం శభాష్ అనిపించుకున్నారు ఈ రైతులు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)