హిమాచల్‌ప్రదేశ్‌: కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్‌‌లో ఘోర ప్రమాదం జరిగింది.

కిన్నౌర్‌ జిల్లా నుగుల్‌సారి ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి 10 మంది చనిపోయారు.

ఇప్పటి వరకు 14 మందిని కాపాడారు.

కొండ చరియ శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.

బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

సిమ్లాకు వెళ్తున్న ఒక ప్రభుత్వ రవాణా బస్సు, మరికొన్ని వాహనాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.

సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు.

హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)