కృష్ణమ్మాళ్ జగన్నాథన్: మహిళకు భూయాజమాన్యం అందించిన ధీశాలి

వీడియో క్యాప్షన్, కృష్ణమ్మాళ్ జగన్నాథన్: మహిళకు భూయాజమాన్యం అందించిన ధీశాలి

94 ఏళ్ల వయసులోనూ కృష్ణమ్మాళ్‌జగన్నాథన్‌సమాజసేవ చేస్తున్నారు. పేదలకు భూములు పంచాలనే తన లక్ష్యం మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది.

మహిళల పేరు మీద భూములు రిజిస్టర్ చేయాలంటూ భారత్‌లో ఉద్యమాన్ని నడిపారు కృష్ణమ్మాళ్‌.

భూస్వాముల నుంచి భూములు తీసుకుని వాటిని పేదలకు పంచివ్వాలనే లక్ష్యంతో 1950ల్లో జరిగిన భూదాన్ ఉద్యమంలో స్వాతంత్ర సమరయోధుడు వినోబా భావేతో కృష్ణమ్మాళ్‌కలిసి నడిచారు.

భూదాన ఉద్యమానికి రక్తపాత రహిత ఉద్యమం అని పేరు. భారత్‌లో ఇదో స్వచ్ఛంద భూ సంస్కరణల ఉద్యమం.

గాంధేయవాది ఆచార్య వినోబా భావే 1951లో దీన్ని ప్రస్తుత తెలంగాణలోని పోచంపల్లి గ్రామంలో ప్రారంభించారు.

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)