హైదరాబాద్: కూకట్‌పల్లిలో కాల్పులు జరిపి ఏటీఎం దోపిడీ - Newsreel

కూకట్‌పల్లి వద్దు ఏటీఎం చోరీ
ఫొటో క్యాప్షన్, కూకట్‌పల్లి వద్ద ఏటీఎం దోపిడీ
చదివే సమయం: 1 నిమిషాలు

కూకట్‌పల్లిలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంలో ఆగంతుకులు సిబ్బంది మీదా, సెక్యురిటీ గార్డు మీదా కాల్పులు జరిపి డబ్బులు తీసుకుని పారిపోయారు.

ఏటీఎంలో క్యాష్‌ నింపుతుండగా ఈ ఘటన జరిగిందని సెక్యూరిటీ గార్డు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

ఆగంతుకుడి చేతిలో తుపాకీ కనబడటంతో తాము భయపడిపోయామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు ఏటీఎం ముందు పడిపోయినట్లు వీడియోలో కనిపించింది. ఆ తర్వాత వారిద్దరి ఆసుపత్రికి తరలించారు.

కాల్పులు జరిపిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు మొదలు పెట్టారు.

Presentational grey line

కోవిడ్: 24 గంటల్లో 3,79,257 పాజిటివ్ కేసులు.. 3,645 మరణాలు

కరోనావైరస్

ఫొటో సోర్స్, API/gettyimages

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు మునుపెన్నడూ లేని స్థాయిలో నమోదయ్యాయి.

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,79,257 పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,645 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తంగా 2,69,507 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జయ్యారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,83,76,524కి చేరగా మృతుల సంఖ్య 2,04,832 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం దేశంలో 30,84,814 యాక్టివ్ కేసులున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)