తమిళనాడు ఎన్నికలు:జయలలిత, కరుణానిధి లేకుండా జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు సత్తా చాటబోతున్నారు

వీడియో క్యాప్షన్, తమిళనాడు ఎన్నికలు: జయలలిత, కరుణానిధి లేకుండా జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు సత్తా చాటబోతున్నారు

దేశంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది.

తమిళనాడు అసెంబ్లీ గడువు ఈ ఏడాది మే 24తో తీరిపోనుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 234 సీట్లకు ఈ ఎన్నికలు జరుగుతాయి. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 118 సీట్లు గెలవాల్సి ఉంటుంది.

ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమాచారం ప్రకారం తమిళనాడులో మొత్తం సుమారు 6.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 3,18,28,727 మంది కాగా, 3,08,38,473 మంది పురుష ఓటర్లు. 7,246 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

మిగతా రాష్ట్రాల ఫలితాలతో పాటే తమిళనాడు ఎన్నికల ఫలితాలను కూడా మే 2న ప్రకటిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)