బంగారం అక్రమ రవాణా: విగ్గులు, సాక్సులు, లోదుస్తుల్లో పెట్టుకుని పసిడి స్మగ్లింగ్ - 5.55 కేజీల గోల్డ్ స్వాధీనం

వీడియో క్యాప్షన్, విగ్గులు, సాక్సులు, లోదుస్తుల్లో పెట్టుకుని బంగారం అక్రమ రవాణా

విగ్గులో పెట్టి అక్రమ రవాణా చేస్తున్న బంగారాన్ని చెన్నై ఎయిర్‌పోర్ట్‌ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

గత రెండు రోజుల్లో ఆరుగురిని అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5.55 కేజీల బంగారాన్ని, రూ.24 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

ఈ బంగారం విలువ రూ.2.53 కోట్లు ఉండొచ్చని అంచనా.

నిందితులు విగ్గులు, సాక్సులు, లోదుస్తులు, మలద్వారం.. ఇలా వివిధ మార్గాల్లో బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించారని అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)