భగత్‌సింగ్ పూర్వీకుల ఇల్లు ఇదే..
'ఇంక్విలాబ్ జిందాబాద్' అనే నినాదానికి మారుపేరుగా నిలిచిన భగత్‌సింగ్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన ఇల్లు ఇప్పుడెలా ఉందో తెలుసా?భగత్‌సింగ్ పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్‌కు దగ్గరలో ఉన్న ఖట్కర్ కలాన్ గ్రామంలో నివసించారు. ఆ గ్రామం ప్రధాన ద్వారం ఇది. 1907 సెప్టెంబర్ 28న ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో బాంగా గ్రామంలో భగత్‌సింగ్ జన్మించారు. ఆనాడు ఇది ఒక పల్లెటూరు. ఇప్పుడు అనేక భవంతులు వెలిశాయి. అయితే భగత్‌సింగ్ పూర్వీకుల ఇల్లు మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. భగత్‌సింగ్ తల్లి 1975 వరకు ఇక్కడే నివసించారు. ఆమె చనిపోయిన తర్వాత మిగతా కుటుంబ సభ్యులు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. భగత్ సింగ్ పూర్వీకుల ఇంటిని జాతీయ వారసత్వ సంపదగా ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడప్పుడు చిన్న చిన్న మరమ్మత్తు పనులు చేస్తుంటారు. పర్యాటకులకు సమాచారం కోసం ఈ ఇంటి ద్వారం వద్ద పురాతత్వ శాఖ ఒక బోర్డును ఏర్పాటు చేసింది. ఈ పసుపు రంగు ఇంట్లోనే భగత్ సింగ్ బాల్యం గడిచింది. భగత్‌సింగ్ తల్లికి చెందిన వస్తువులను సురక్షితంగా ఉంచడం కోసం ఈ ఇంటి లోపలి భాగాన్ని పురాతత్వ శాఖ మూసేసింది. నగిషీలు చెక్కిన నులక మంచం, అల్మారా వందేళ్లు దాటినా ఇంకా చెక్కు చెదరలేదు. బొగ్గుల ఇస్త్రీ పెట్టె వంటి వస్తువులు ఈ అల్మరాలో ఉన్నాయి. ఆనాడు స్నానానికి ఉపయోగించిన బాత్ టబ్, బకెట్ ఇంకా అలాగే ఉన్నాయి. భగత్ సింగ్ తల్లి 1975 దాకా ఈ వస్తువుల్ని ఉపయోగించే వారట. వంటింట్లో కనిపించే పాత్రల్లో ఎక్కువ భాగం రాగి, ఇత్తడివే. ఖట్కర్ కలాన్ గ్రామంలో పంజాబ్ ప్రభుత్వం భగత్ సింగ్ స్మృత్యర్థం ఒక మ్యూజియం ఏర్పాటు చేసింది. ఈ మ్యూజియంలో ఆయనకు సంబంధించిన అనేక ఇతర వస్తువుల్ని ఉంచారు.
ఇవి కూడా చదవండి:
- 90 ఏళ్ల క్రితం కులం గురించి భగత్‌సింగ్ ఏం చెప్పారు?
- భగత్ సింగ్ పిస్టల్ 85 ఏళ్ల తర్వాత ఎలా దొరికింది?
- కౌన్సిల్ హౌజ్‌లో బాంబులు వేసేందుకు ఆనాడు భగత్ సింగ్ అనుసరించిన వ్యూహం ఇదే...
- ఇస్లాం స్వర్ణయుగం: జ్యోతిషశాస్త్రాన్ని అధ్యయనం చేసిన అరబ్ తత్వవేత్త అల్-కింది
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- ఆత్మవిశ్వాసం తగ్గి ఆందోళన పెరిగినప్పుడు ఈ సింపుల్ టెక్నిక్ పాటిస్తే చాలు
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
- భారత్-పాక్ 1965 యుద్ధం: జనరల్ అయూబ్ ఖాన్ రహస్య బీజింగ్ పర్యటన, యుద్ధం చేయాలని చైనా సలహా
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- అరుణ్ శౌరి: వాజపేయి కేబినెట్లో మంత్రి.. మోదీ ప్రభుత్వం వచ్చాక సీబీఐ కేసులో నిందితుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)