నాలుగు ఎకరాల్లో కొత్తిమీర సాగు చేసి.. రూ. 12 లక్షలు సంపాదించిన రైతు
మహారాష్ట్రలో వినాయక్ హెమాడే అనే రైతు నాలుగు ఎకరాల్లో కొత్తిమీర పంట వేసి, మూడు నెలల్లో రూ. 12 లక్షలు సంపాదించారు.
ఈయనే వినాయక్ హమాడే. ఈయనది నాశిక్ జిల్లాలోని సిన్నార్ ప్రాంతం. కొత్తిమీర తనకు ఇంతటి లాభం ఎలా తెచ్చిపెట్టిందో వివరించారాయన.
‘‘ఏటా నాలుగైదు ఎకరాల్లో కొత్తిమీర వేస్తుంటా. ఎప్పుడూ పంట మార్పిడి ఉండేలా చూసుకుంటా. పోయిన ఏడాది కొత్తిమీరపై పెద్దగా లాభం రాలేదు. ఈ ఏడాది మొదట ఎకరంనర విస్తీర్ణంలో వేశా. మంచి లాభమే వచ్చింది. దాంతో కొత్తిమీర సాగును కొనసాగించాలనుకున్నా’’ అని చెప్పారు.
‘‘వాతావరణం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండదు. ఇదే మనసులో పెట్టుకుని, కొత్తిమీర వేశా. మంచి లాభాలు వచ్చాయి’’ అని పేర్కొన్నారు.
‘‘ఇండోర్, దిల్లీ నగరాల నుంచి కొందరు వ్యాపారులు ముందుగానే వచ్చి నన్ను కలిశారు. వాళ్లకు కొత్తిమీర సరఫరా చేయడం కుదురుతుందా అని అడిగారు. అప్పుడే ధరలు మాట్లాడుకున్నాం. రూ.15 లక్షల నుంచి రూ.16 లక్షల వరకూ ఆశిస్తున్నానని వారికి చెప్పా. మార్కెట్ ధరల దృష్ట్యా అంత మొత్తం ఇవ్వలేమని, రూ.12.51 లక్షలకైతే కొంటామని అన్నారు. నేను అంగీకరించా. పంటను వారికి అమ్మేశా’’ అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- మోదీకి మీడియా అంటే భయమా? ఇంటర్వ్యూల్లో ఆయన తీరు ఎలా ఉంటుంది?
- ‘నరేంద్ర మోదీ తరంగాలు’: విద్యావేత్తల వ్యాఖ్యలపై శాస్త్రవేత్తల అసహనం
- జీడీపీ వృద్ధిరేటులో పతనం మొదలైతే ఏం జరుగుతుంది
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- చైనా వెళ్లిన ఇంటర్‌పోల్ చీఫ్ ఏమయ్యారంటే..
- ముస్లిం వీగర్లను వేధించారని 28 చైనా సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన అమెరికా
- చైనా దూకుడుకు బ్రేకులు పడ్డట్లేనా? ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న కల నెరవేరేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)