అమితాబ్ బచ్చన్ కరోనా కవిత: నన్ను నమ్ము ఇది రెండు నిమిషాలే...'

వీడియో క్యాప్షన్, అమితాబ్ బచ్చన్ కరోనా కవిత: నన్ను నమ్ము ఇది రెండు నిమిషాలే...'

కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిపై ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ కవిత ఇది. 'నిజమే.. ఇది కష్టమైన సందర్భమే, కానీ కరిగిపోతుంది. కాలంతో పాటు వెళ్లిపోతుంది' అంటూ ఎంతో నమ్మకంగా ఆశావాదాన్ని వినిపించారు అమితాబ్ ఈ కవితలో.

అమితాబ్ ఈ కవితను వీడియో రూపంలో ఈ నెల 8న ట్విటర్లో పోస్ట్ చేశారు. అమితాబ్ కు, ఆయన కుమారుడు, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కు కరోనావైరస్ సోకింది. ఈ విషయాన్ని అమితాబ్ నిన్న రాత్రి ట్విటర్లో తెలిపారు.

అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్‌ల పరిస్థితి మెరుగవుతోందని, మందులకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)