కపిల్ దేవ్: ప్రపంచ‌కప్ అందుకున్నాక ఏం చేశారు.. ధోనీ, కోహ్లి గురించి ఏమన్నారు?

వీడియో క్యాప్షన్, కపిల్ దేవ్: ప్రపంచ‌కప్ అందుకున్నాక ఏం చేశారు.. ధోనీ, కోహ్లి గురించి ఏమన్నారు?

"వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి మనం సుదీర్ఘ కాలం ఆడాల్సుంటుంది. విరాట్ మరో ఐదారేళ్లు పిచ్‌పై ఉంటే, తన సత్తా కొనసాగిస్తే అతడు ఎన్నో ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టగలడు".

భారత్‌కు 1983 వరల్డ్ కప్ అందించిన భారత క్రికెటర్ కపిల్ దేవ్ ఈ మాట అన్నారు. ఆయనను కలవడానికి బీబీసీ టీమ్ హరియాణాలోని మనేసర్‌లో ఉన్న ఒక గోల్ఫ్ క్లబ్‌ చేరుకుంది.

భారత జట్టులో సుదీర్ఘ కాలం వికెట్ల వెనుక తన జోరు చూపించిన ధోనీ లేని లోటు నుంచి టీమిండియా ఎలా కోలుకోగలదు?

ఈ ప్రశ్నకు కపిల్ దేవ్ "మొదట్లో మనం గావస్కర్ లేకుంటే జట్టు ఏమవుతుందని ఆలోచించాం. తర్వాత టెండుల్కర్ లేకుండా టీమ్ ఏమవుతుందో అనుకున్నాం. కానీ, జట్టు ఆ వ్యక్తుల కంటే చాలా పెద్దదని మనం గుర్తుంచుకోవాలి. ఆ వ్యక్తి మైదానంలో లేకుంటే మనం కచ్చితంగా మిస్ అవుతాం. కానీ ధోనీ దేశానికి ఎంత చేయాలో, అంత చేశాడు. అదే తలుచుకుంటూ దిగులు పడుతుంటే, మనం ముందుకు వెళ్లలేం" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)