You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ : ‘21వ శతాబ్దం భారత్‌దే.. రూ.7వేల కోట్ల పెట్టుబడులు పెడతాం’
భారత్‌లో చిన్న, మధ్య తరహా వ్యాపారాలను డిజిటలైజ్ చేసేందుకు సుమారు రూ.7వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్ ప్రకటించారు.
భారత్ అభివృద్ధికి ఎంతో అవకాశమున్న ప్రధానమైన మార్కెట్ అని, 21వ శతాబ్దం భారత్‌దేనని ఆయన అన్నారు.
ఇప్పుడు ప్రకటించిన కొత్త పెట్టబడులతో అమెజాన్ చిన్న, మధ్య తరహా వ్యాపారాలను డిజిటలైజ్ చేస్తుందని.. ఆన్‌లైన్‌లో అమ్మకాలు, కార్యకలాపాలు సాగించే అవకాశం వాటికి కల్పిస్తుందని బెజోస్ చెప్పారు.
దిల్లీలో అమెజాన్ సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బెజోస్ ప్రస్తుతం మూడు రోజుల భారత పర్యటనలో ఉన్నారు. ఆయనకు చాలా చోట్ల నిరసనలతో స్వాగతం ఎదురయ్యే అవకాశాలున్నాయి.
300కుపైగా పట్టణాల్లో చిన్నతరహా వ్యాపారులు అమెజాన్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. స్థానిక రిటైల్ మార్కెట్‌ను అమెజాన్ నిర్వీర్యం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లు ప్రకటిస్తూ, కొందరు భారీ విక్రయదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ తమ వ్యాపారాలను అమెజాన్ దెబ్బతీస్తోందని అంటున్నారు.
ఈ ఆరోపణలను అమెజాన్ తోసిపుచ్చుతోంది.
''భారత్‌లో కనిపించే శక్తి సామర్థ్యం, హుషారు, అభివృద్ధి ప్రత్యేకం. పైగా ఇది ప్రజాస్వామ్య దేశం'' అని జెఫ్ బెజోస్ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు.
2025కల్లా రూ.70వేల కోట్ల విలువైన భారత్‌లో తయారైన వస్తువులను ఎగుమతి చేస్తామని ఆయన అన్నారు. దేశంలో రూ.38.9 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ ఇదివరకే కట్టుబడి ఉందని చెప్పారు.
భారత్‌లో ఈ-కామర్స్ రంగంలో ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ (అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ అనుబంధ సంస్థ)ల ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే, విదేశీ సంస్థలు, వాటి అనుబంధ సంస్థల ఆన్‌లైన్ రిటైల్ అమ్మకాలపై ఆంక్షలు విధిస్తూ గత ఏడాది భారత ప్రభుత్వం చేసిన చట్టాలు వీటికి ప్రతికూలంగా మారాయి.
ఈ నెల ఆరంభంలో భారత వాణిజ్యవేత్త ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోని రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో విభాగాలు కలిసి.. 'జియోమార్ట్' పేరుతో సరకుల డెలివరీ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి.
జియో మార్ట్‌ను అమెజాన్‌కు పోటీగా విశ్లేషకులు చూస్తున్నారు.
దేశవ్యాప్తంగా తమకు భారీ స్థాయిలో ఉన్న జియో మొబైల్ నెట్‌వర్క్ వినియోగదారుల బేస్‌ను ఈ కొత్త వ్యాపారానికి ఉపయోగించుకోవాలని రిలయన్స్ భావిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- అమెజాన్‌కు రిలయన్స్ జియోమార్ట్ పోటీ ఇవ్వగలదా
- వు హుయాన్: పేదరికం కారణంగా గుప్పెడు అన్నం, పిడికెడు మిరపకాయలు ఐదేళ్లపాటు తిన్న చైనా విద్యార్థిని మృతి
- ‘దేశంలో ఆర్థికపరమైన అత్యవసర పరిస్థితి.. విధానపరమైన నిర్ణయాలు అవసరం’
- ఆస్ట్రేలియాలో వేల సంఖ్యలో ఒంటెలను చంపేస్తున్నారు... ఎందుకు?
- భారత 'యూనికార్న్'లు మరీ శక్తిమంతంగా ఎదుగుతున్నాయా?
- పొరుగు దేశాల ముస్లింలను ‘బంధిస్తున్న’ చైనా.. ‘నిర్బంధ క్యాంపుల్లో కొడుతున్నారు, ఏవేవో ఇంజెక్షన్లు చేస్తున్నారు’
- భారత్‌లో వ్యాపారం ఎంత ఈజీగా మారిపోయిందంటే..
- ‘47 ఏళ్ల ఈ వ్యక్తి జేఎన్‌యూ విద్యార్థి.. 32 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు’ నిజమేనా? - BBC Fact Check
- గూగుల్ కన్నా వందేళ్ల ముందే డేటాతో సంపన్నుడైన ఘనుడు
- పెరిగిన ద్రవ్యోల్బణం ప్రభావం సామాన్య ప్రజలపై ఎలా ఉంటుంది?
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ - అమెజాన్‌ల మధ్య వివాదంతో లాభపడిన మైక్రోసాఫ్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)