వీడియో: విశాఖ ఏజెన్సీలో స్ట్రాబెర్రీ సాగు

వీడియో క్యాప్షన్, విశాఖ ఏజెన్సీలో స్ట్రాబెర్రీ సాగు ఈ ప్రాంతమే ఎందుకంత అనుకూలం?

స్ట్రాబెర్రీ సాగు విశాఖ ఏజెన్సీలో జోరందుకుంది. గతంలో ఇద్దరు ముగ్గురు రైతులు మాత్రమే స్ట్రాబెర్రీస్ పండించేవారు. లాభాలు ఎక్కువగా ఉండడంతో మరింత మంది రైతులు స్ట్రాబెర్రీ సాగులోకి దిగుతున్నారు.

విటమిన్ సీ, పోషక విలువలు స్ట్రాబెర్రీస్‌లో అధికంగా ఉంటాయి. సమశీతోష్ణ స్థితి ఉష్ణోగ్రతల్లో స్ట్రాబెర్రీస్ బాగా పండుతాయి. అంటే ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల నుంచి 25 డిగ్రీల మధ్య ఉండాలి.

హరియాణ, మహారాష్ట్రల్లో పాలీ హౌస్ తోటల్లో వీటిని సాగు చేస్తున్నారు. పంజాబ్, కర్నాటకలో కొద్ది ప్రాంతాల్లో ఇవి పండిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో 2007 నుంచి రైతులు సాగు చేస్తున్నారు. పూర్తి ఉద్యాన పంట కావడంతో ఎంతో జాగ్రత్తగా సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)