You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆర్టీసీ కార్మికుల ‘చలో ట్యాంక్‌బండ్’ ఉద్రిక్తం.. అరెస్ట్‌లు, రాళ్లదాడి, లాఠీఛార్జ్
ఆర్టీసీ సమ్మెలో భాగంగా శనివారం ఆర్టీసీ జేఏసీ ‘చలో ట్యాంక్‌బండ్’ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలతో పాటు, ఆయా పార్టీల అనుబంధ సంఘాలు, తెలంగాణ జేఏసీ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించాయి.
అయితే, ఉదయం నుంచే ఈ నిరసన కార్యక్రమం కోసం ట్యాంక్ బండ్‌కు వెళ్లేందుకు సిద్ధమైన పార్టీ నాయకులను పోలీసులు నిర్బంధించారు.
పలువురు నాయకులు, ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్‌వద్దకు చేరుకోగా వారిని అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో కొందరు ఆర్టీసీ కార్మికులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
ట్యాంక్ బండ్‌వైపు వెళుతున్న ఆర్టీసీ కార్మికులు, టీజేఏసీ, రాజకీయ పార్టీల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, పలు పోలీసు స్టేషన్లకు తరలించారు.
కార్మికుల రాళ్లదాడి, పోలీసుల లాఠీఛార్జిల్లో ఇరు వర్గాల్లో పలువురికి గాయాలు అయ్యాయి.
ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమం నేపథ్యంలో ఉదయం నుంచి ట్యాంక్ బండ్‌పై రాకపోకల్ని నిలిపివేసిన పోలీసులు సాయంత్రం ఆంక్షలు ఎత్తేసి, రాకపోకలకు అనుమతి ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- అయోధ్య తీర్పు: సుప్రీంకోర్టు తీర్పులో ఐదు ముఖ్యాంశాలు
- అయోధ్య కేసు: పురాతత్వశాఖ సర్వేలో రామ మందిర అవశేషాలు లభించాయా?
- ''సుప్రీం బట్ నాట్ ఇన్ఫాలిబుల్'': అయోధ్య తీర్పుపై అసదుద్దీన్ ఒవైసీ ఏమన్నారు?
- ఎల్కే అద్వానీ: రథయాత్ర సమయంలో ఈ బీజేపీ నేతను ఎలా అరెస్టు చేశారు?
- అయోధ్య: ఇది నిజంగానే రామ జన్మస్థలమా? దీని చరిత్ర ఏమిటి?
- అయోధ్య- రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం పూర్తి చరిత్ర
- ఇంగ్లిష్ మీడియంతో తెలుగు భాషకు ప్రమాదమా...
- బెర్లిన్ వాల్ కూలిపోయి 30 ఏళ్లయ్యాక.. యూరప్ దేశాలు ఇప్పుడు అడ్డుగోడలు ఎందుకు నెలకొల్పుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)