You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విరాట్ కోహ్లీ: జావెద్ మియాందాద్ 26 ఏళ్ల రికార్డు బ్రేక్
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండిస్‌తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విరాట్ 26 ఏళ్ల రికార్డును తిరగరాశాడు.
ఇప్పటి వరకు వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాకిస్థాన్ ఆటగాడు జావెద్ మియాందాద్ పేరిట రికార్డు ఉంది.
మియాందాద్ వెస్టిండిస్‌పై 64 ఇన్నింగ్స్‌ల్లో 1,930 పరుగులు చేశాడు. ఇప్పుడు విరాట్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు.
19 పరుగులు చేస్తే మియాందాద్ రికార్డును సమం చేసే క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ కరీబియన్ జట్టుపై విరుచకపడ్డాడు. 125 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 120 పరుగులు చేశాడు.
వన్డేలో కోహ్లీకి ఇది 42వ శతకం. ఈ సెంచరీతో వెస్టండీస్‌పై అతని పరుగులు 2,032కు చేరుకుంది. 35 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ ఈ ఘనత సాధించాడు.
సౌరవ్ రికార్డు బ్రేక్... సచిన్ రికార్డుకు చేరువలో
టీం ఇండియా సారథి ఇదే వన్డేలో మరో రికార్డునూ సాధించాడు.
భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడుగా విరాట్( 11,406) నిలిచాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(11,363)ని అధిగమించాడు.
ఇప్పటి వరకు భారత్ తరఫునే కాకుండా ప్రపంచంలో అత్యధిక పరుగులు చేసిన వన్డే ఆటగాడుగా సచిన్( 18,426) మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో కోహ్లీ 8వ స్థానంలో నిలిచాడు.
ఇవి కూడా చూడండి:
- అంతరిక్షంలోకి కొత్త జంటల ప్రేమ సందేశాలు
- #HerChoice: నా భర్త నన్ను ప్రేమించాడు, కానీ పడగ్గదిలో హింసించాడు
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- కోలివింగ్: ఉద్యోగ రీత్యా నగరాలు మారే యువత కొత్త చాయిస్
- ఒక అమ్మాయికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్... ఆ ముగ్గురితో ప్రేమ సాధ్యమేనా?
- ఆ 132 గ్రామాల్లో అసలు ఆడపిల్లలే పుట్టలేదా...
- కార్గిల్ స్పెషల్: యుద్ధంలో పాక్ సైనికులకు ఆహారం అందించిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారు?
- ‘రాజకీయ నేతల ప్రేమ వ్యవహారాలపై ఎవ్వరూ బహిరంగంగా ఎందుకు మాట్లాడరు?’
- స్వలింగ సంపర్కుడైన కుమారుడి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
- చర్చనీయాంశమైన 'పాలిచ్చే తల్లి' ఫొటో!
- తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా?
- ప్రసవంలో బిడ్డ చనిపోతే మళ్లీ గర్భధారణకు ఎన్నాళ్ళు ఆగాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)