జమ్మూ కశ్మీర్ పోలీసు హత్య: ఒడిలో పాప.. ఒంట్లో తుపాకీ తూటాలు

వీడియో క్యాప్షన్, జమ్మూ కశ్మీర్ పోలీసు హత్య: ఏడాదిన్నర పాప మెడపై కత్తి.. పోలీసు తలపై తుపాకీ

జమ్ము కశ్మీర్‌లో మిలిటెంట్ల దాడులు, ఇతర హింసాత్మక ఘటనల కారణంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 40 మంది అధికారుల్ని కోల్పోయింది జమ్ము కాశ్మీర్ పోలీస్ విభాగం.

గురువారం అపహరణకు గురైన నలుగురు పోలీసుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారిని కిడ్నాప్ చేసిన గ్రామానికి కిలోమీటరు దూరంలో వారి మృతదేహాలు లభించాయి.

ఈ ఘటనకు బాధ్యులం తామేనంటూ హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు సంబంధించినదిగా భావిస్తున్న ట్విట్టర్ హ్యాండిల్ పేర్కొంది. మరోవైపు ఈ ఘటన తర్వాత పోలీసులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తల్ని కేంద్ర హోం శాఖ ఖండించినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

ఓ వైపు స్థానికుల మానవహక్కుల్ని హరిస్తున్నారంటూ పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తుతుంటే .. మరోవైపు అదే పోలీసులు అనేక సవాళ్లతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)