కశ్మీర్ భారతదేశంలో ఇలా కలిసింది!
దేశ విభజన సమయంలో స్వతంత్ర దేశంగా ఉండాలని భావించిన జమ్మూ కశ్మీర్ భారత్‌లో కలవడానికి కారణమేంటి? జమ్మూ కశ్మీర్ మహారాజు హరిసింగ్.. భారత్ వైపు ఎందుకు మొగ్గు చూపారు? పాకిస్తాన్ కబాలీలు కశ్మీర్‌లో ఏం చేశారు? నాటి ఘటనలకు ప్రత్యక్ష సాక్షి మొహమ్మద్ సుల్తాన్.
బీబీసీ ప్రతినిధి అమీర్ పీర్జాదతో ఆయన తన జ్ఞాపకాలను పంచుకున్నారు.
అది దేశ విభజన సమయం.. రెండు వైపులా ఉద్రిక్తతలు.. భారత్-పాక్‌ల కన్ను కశ్మీర్‌పైనే ఉంది. కశ్మీర్ మహారాజు స్వతంత్ర దేశంగా ఉండాలనుకున్నారు. అంతలోనే పాకిస్తాన్ నుంచి ఊహించని పరిణామం. పాకిస్తాన్ గిరిజనులు కశ్మీర్‌లోని మొహురా విద్యుత్ కేంద్రంపై దాడి చేశారు.
దాంతో కశ్మీర్ రాజైన హరిసింగ్ భారత్ సాయం కోరారు. వెంటనే స్పందించిన భారత ప్రభుత్వం రాజుకు అండగా సైన్యాన్ని పంపింది. పాకిస్తాన్ గిరిజనులుగా చెప్పుకునే కబాలీలను భారత సైన్యం తరిమికొట్టింది. ఆ తర్వాత కశ్మీర్‌ను భారత్‌లో కలుపుతున్నట్లు ఒప్పందంపై మహారాజు హరిసింగ్ సంతకం చేశారు.
ఆనాటి ఘటనలను బీబీసీతో పంచుకున్నారు..జమ్మూ కశ్మీర్‌కు చెందిన మొహమ్మద్ సుల్తాన్. పాకిస్తాన్ గిరిజనులకు భయపడి అడవుల్లో దాక్కున్నామని ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారాయన. ఆయన ఇంకేం చెప్పరో ఈ వీడియోలో చూడండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)