'అంబేడ్కర్'కు పంజరం నుంచి విముక్తి ఎప్పుడు?

- రచయిత, అంజయ్య తవిటి
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్‌రావ్ అంబేడ్కర్‌కు గౌరవంగా దేశంలో పలు చోట్ల విగ్రహాలు కట్టారు.
పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా, రహదారి కూడళ్లలో, రైల్వే స్టేషన్లలో, బస్టాండుల్లో, పార్కుల్లో, కార్యాలయాల్లో చాలా చోట్ల అంబేడ్కర్ విగ్రహాలు కనిపిస్తాయి.
కానీ, కొంతకాలంగా దళిత వ్యతిరేకులు కొందరు ఆ విగ్రహాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు.
దాంతో విగ్రహాల రక్షణ కోసం కొన్ని చోట్ల పోలీసు భద్రత ఏర్పాటు చేస్తుండగా, మరి కొన్ని చోట్ల ఇనుప పంజరాలు ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, Rajesh
పంజరంలో అంబేడ్కర్!
అంబేడ్కర్ విగ్రహాలకు చెప్పుల దండలు వేసి అవమానించడం, ధ్వంసం చేయడం, కూల్చడం వంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి.
కులాల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేందుకు, దళితులను దాడులకు ఉసిగొల్పేందుకు కొందరు ఈ పనులు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
అయితే, అలాంటి వికృత చర్యలకు పాల్పడేవారిని కట్టడి చేయలేక విగ్రహాల చుట్టూ ఇనుప కంచె లేదా పంజరం నిర్మిస్తున్నారు.
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి చుట్టూ ఇట్లాగే పంజరం ఏర్పాటు చేశారు.
ఆ విగ్రహంపై పలుమార్లు దాడి జరిగింది. అయితే, దానిపై దళిత సంఘాలు ప్రతిసారీ ఫిర్యాదు చేస్తున్నా, నిందితులను గుర్తించడంలో పోలీసులు విఫలమవుతున్నారని స్థానిక పాత్రికేయులు ఒకరు తెలిపారు.
ఆ విగ్రహంపై 2017 అక్టోబర్, డిసెంబర్‌లో కూడా వరుసగా దాడులు జరగడంతో ఇక చేసేది లేక దళిత సంఘాలే అంబేడ్కర్ విగ్రహానికి చుట్టూ గట్టి ఇనుప పంజరం ఏర్పాటు చేశాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ అలాగే జరిగింది.
బదాయూన్ జిల్లాలోని రద్దీగా ఉండే గద్ది చౌక్ ప్రాంతంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం చుట్టూ ఇనుప తీగలతో చేసిన పంజరాన్ని ఏర్పాటు చేశారు. కాపలాగా పోలీసులను కూడా పెట్టారు.
అంబేడ్కర్ జయంతికి కొద్ది రోజుల ముందే ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాంతో అధికారులు దాన్ని తొలగించారు.
వరుస దాడులు
త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చిన తర్వాత గడచిన రెండు నెలల వ్యవధిలో విగ్రహాలను ధ్వసం చేసిన ఘటనలు వరుసగా జరిగాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్, అలీగఢ్, బారాబంకీ, ఫిరోజాబాద్, అలహాబాద్, నోయిడా, అజాంగఢ్‌లలో అంబేడ్కర్ విగ్రహాలపై దాడులు జరిగాయి.
గురువారం నోయిడాలోనూ అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
బుద్వాన్ జిల్లాలోనే ఇటీవల ఓ విగ్రహానికి కాషాయం రంగు వేశారు. దానిపై విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు మళ్లీ నీలి రంగు వేశారు.
విగ్రహాలపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
కానీ, ఇంతవరకూ ఎక్కడా అరెస్టులు జరిగిన దాఖలాలు లేవని న్యూస్18 పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
శుక్రవారం హరియాణాలోని అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
కులాల ఆధారంగా రిజర్వేషన్లను రద్దు చేయాలంటూ మంగళవారం బిహార్‌లో జరిగిన నిరసనల సందర్భంగా షేక్‌పురా జిల్లాలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసమైంది.
అంతకుముందు నవాదా జిల్లాలోనూ అలాంటి ఘటనే జరిగింది.
జాతీయ నేర గణాంకాల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించిన నివేదిక ప్రకారం 2016లో ఉత్తర్‌ప్రదేశ్‌లో దళితులపై ఎక్కువగా దాడులు జరిగాయి.
తర్వాతి స్థానాల్లో బిహార్, రాజస్తాన్ ఉన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
తమిళనాడులో అదే పరిస్థితి
రాజ్యాంగ నిర్మాత విగ్రహాలను పంజరాల్లో పెట్టడం తమిళనాడులో చాలాకాలంగా కొనసాగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా అనేక విగ్రహాలకు రక్షణగా ఇనుప జాలీలు తొడిగారు.
అయితే కులాల మధ్య కలహాలు సృష్టించే వారిని కట్టడి చేయకుండా విగ్రహాలను అలా పంజరాల్లో పెట్టడం ఏమిటి? అంటూ చాలామంది విమర్శించారు.
దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. కుల వివాదాలతో ఎక్కువగా సతమతమైన రాష్ట్రాల జాబితాలోనూ ఉంది.
"రాష్ట్ర జనాభాలో దాదాపు 20 శాతం ఉన్న దళితులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, మహానేత అంబేడ్కర్ విగ్రహాలను పంజరాల్లో పెట్టడమే అందుకు ఉదాహరణ" అని రాజకీయ నిపుణులు సి.లక్ష్మణన్ విమర్శించారు.
మార్చిలో చెన్నై సమీపంలోని తిరువొట్రియూర్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహంపై గుర్తుతెలియని వ్యక్తులు రంగు చల్లారు. ఆ విగ్రహం కూడా పంజరంలోనే ఉంది.
"సామాజిక, ఆర్థిక అసమానతలు ఎక్కువ కాలం కొనసాగితే ప్రజాస్వామ్యానికే హానికరం" అని ఓ ప్రసంగంలో అంబేడ్కర్ అన్నారు.
కులమత భేదాలు విడనాడి అందరూ సామరస్యంగా ఉండాలన్న ఆ మార్గదర్శి కల సాకారమయ్యేదెన్నడు?
ఇవి కూడా చదవండి:
- కామన్వెల్త్ క్రీడలు: ఇద్దరు భారత క్రీడాకారుల సస్పెన్షన్.. ఇంటికి పంపిన అధికారులు
- మనం సగం మనుషులమే! మన శరీరంలో సగానికి పైగా సూక్ష్మజీవులే!!
- ‘అప్పుడు అంబేడ్కర్ పేరు పలకడానికి సిగ్గుపడేదాన్ని.. ఇప్పుడు గర్వపడుతున్నా’
- తండ్రిని ఆకలి ఓడించింది, ఆ తండ్రిని కొడుకు గెలిపించాడు.. రాహుల్ 'గోల్డ్' కోస్ట్ స్టోరీ ఇదీ!
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








