అఫ్గానిస్తాన్: యూనివర్సిటీల్లో మహిళల ప్రవేశాలను నిలిపివేస్తామని ప్రకటించిన తాలిబాన్లు

వీడియో క్యాప్షన్, అమ్మాయిలకు ఉన్నత విద్యను రద్దు చేసిన అఫ్గాన్ ప్రభుత్వం
అఫ్గానిస్తాన్: యూనివర్సిటీల్లో మహిళల ప్రవేశాలను నిలిపివేస్తామని ప్రకటించిన తాలిబాన్లు

అఫ్గానిస్తాన్‌యూనివర్సిటీల్లో మహిళలకు ప్రవేశాన్ని నిలిపివేస్తున్నామని తాలిబాన్లు ప్రకటించినట్లు ఉన్నత విద్యా మంత్రి లేఖ ద్వారా తెలిసింది.

వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆయన భావిస్తున్నారు. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని చెప్పారు.

తాలిబాన్లు తీసుకున్న తాజా నిర్ణయం మహిళలకు ఉన్నత విద్యను దూరం చేస్తుంది. అఫ్గాన్‌లో ఇప్పటికే అనేక సెకండరీ పాఠశాలల్లో విద్యకు బాలికలు దూరమయ్యారు.

ఈ వార్త విన్నప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నానని బీబీసీకి కాబూల్ యూనివర్సిటీ విద్యార్థిని ఒకరు చెప్పారు.

మూడు నెలల క్రితమే వేలాది మంది విద్యార్థినిలు యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలు రాశారు.

అక్కడ విద్యార్థినులు చదివే సబ్జెక్టులపై కూడా ఆంక్షలు విధించారు. వెటర్నరీ సైన్స్, ఇంజినీరింగ్, ఎకనమిక్స్, అగ్రికల్చర్ సబ్జెక్టులపై పరిమితులు విధించిన తాలిబాన్లు, జర్నలిజం సబ్జెక్టుపై తీవ్ర ఆంక్షలు విధించారు.

అఫ్గాన్ మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)