తేలు విషం లీటర్ రూ. 80 కోట్లు...అంత డిమాండ్ ఎందుకంటే

వీడియో క్యాప్షన్, తేలు విషం లీటర్ 80 కోట్ల రూపాయలు
తేలు విషం లీటర్ రూ. 80 కోట్లు...అంత డిమాండ్ ఎందుకంటే

ఒక చిన్న చుక్క తేలు విషం కూడా ఎంతో ఖరీదైంది. ఒక లీటర్‌ తేలు విషం ధర 10 మిలియన్ డాలర్లు. అంటే రూ. 80 కోట్ల పైమాటే.

తుర్కియేలోని ఓ ల్యాబ్‌ తేళ్ల నుంచి రోజుకు 2 గ్రాముల విషం సేకరిస్తోంది.

బాక్సుల్లోంచి తేళ్లను బయటకు తీసి వాటి నుంచి ప్రత్యేక పద్ధతుల్లో విషం సేకరిస్తారు.

మెటిన్‌ ఒరిన్లెర్‌ అనే తేళ్ల ఫామ్ యజమాని బీబీసీతో మాట్లాడుతూ...విషం ఎలా సేకరిస్తారనే వివరాలు తెలిపారు.

తేలు విషం

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘‘మేం తేళ్లను పెంచి, వాటి నుంచి విషాన్ని సేకరిస్తాం. ఆ విషాన్ని గడ్డకట్టేలా చేస్తాం. ఘనీభవించిన విషాన్ని తర్వాత పొడిగా మార్చి, విక్రయిస్తాం’ అని చెప్పారు.

తేలు విషాన్ని యాంటీబయాటిక్స్.. కాస్మోటిక్స్.. పెయిన్‌కిల్లర్ల తయారీలో ఉపయోగిస్తారు.

‘ఒక తేలులో 2 మిల్లీగ్రాముల విషం ఉంటుంది. సాధారణంగా 300 - 400 తేళ్ల నుంచి మేం ఒక గ్రాము విషం సేకరిస్తాం’ అని మెటిన్‌ చెప్పారు.

( ఈ కథనం ఆగస్టు18, 2022న మొదటిసారి ప్రచురితమైంది)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)