అదానీ కేసులో ఆంధ్రప్రదేశ్ పేరు ఎందుకు వినిపిస్తోంది
అదానీ కేసులో ఆంధ్రప్రదేశ్ పేరు ఎందుకు వినిపిస్తోంది
గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ అమెరికాలో కేసు నమోదైంది. అమెరికాలో పెట్టుబడిదారుల నుంచి సేకరించిన డబ్బును భారత్‌లోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చేందుకు వినియోగించారనేది ప్రధాన ఆరోపణ.
ఆ లంచాల్లో 80 శాతానికి పైగా అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తికి ఇచ్చినట్టు కూడా అందులో పేర్కొన్నారు.
గౌతమ్ అదానీపై అమెరికాలో మోపిన అభియోగాలేంటి? అసలు ఈ కేసేంటి? ఇది ఏ మలుపు తిరగబోతోంది? ఈ వ్యవహారంలో ఏపీ అప్పటి సీఎం పేరెందుకొచ్చింది? దీనిపై ఇప్పుడేం జరగబోతోంది?
ఈ అంశాలపై వీక్లీ షో విత్ జీఎస్‌లో బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









