Short term policy: దీపావళి గాయాలకు కూడా ఈ పాలసీలో కవరేజీ ఉంటుందని తెలుసా...

వీడియో క్యాప్షన్, దీపావళి నాడు గాయాలైతే ఈ పాలసీ కింద రూ.25వేల వరకు కవరేజీ లభిస్తుంది
Short term policy: దీపావళి గాయాలకు కూడా ఈ పాలసీలో కవరేజీ ఉంటుందని తెలుసా...

ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల ఇన్సూరెన్స్ స్కీములు అందుబాటులో ఉన్నాయి. వాటిలో తాత్కాలిక ఇన్సూరెన్స్ ఒకటి.

వీటినే షార్ట్‌టర్మ్ పాలసీలుగా పిలుస్తారు.

సాధారణంగా వారం రోజుల నుంచి ఏడాది లోపు కాలవ్యవధికి తీసుకునే ఇన్సూరెన్స్‌లను ‘షార్ట్ టర్మ్ ఇన్సూరెన్స్‌’గా వ్యవహరిస్తారు.

ఈ దీపావళికి 9 రూపాయల ప్రీమియంతో ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్‌ను ఫోన్‌పే తీసుకొచ్చింది.

అంటే దీపావళి రోజు టపాసులు కాల్చేటప్పుడు గాయాలైతే ఈ పాలసీ కింద 25 వేల రూపాయల వరకూ కవరేజీ ఇస్తారు.

ఈ ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ కాలవ్యవధి పది రోజులు మాత్రమే. ఇలా స్వల్పకాల వ్యవధికి మాత్రమే చేసే ఇన్సూరెన్స్ పాలసీలను షార్ట్‌టర్మ్ పాలసీలంటున్నారు.

వీటి గురించి పూర్తి వివరాల కోసం పై వీడియో చూడండి.

షార్ట్ టర్మ్ పాలసీ

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)