ఈ పట్టు చీరకు అంచే ప్రత్యేకం.. కోరుకున్న డిజైన్‌లో నేయాలంటే 15 రోజులు పడుతుంది
ఈ పట్టు చీరకు అంచే ప్రత్యేకం.. కోరుకున్న డిజైన్‌లో నేయాలంటే 15 రోజులు పడుతుంది
ఇది ప్రసిద్ధిచెందిన కర్వత్ కాఠీ లేదా రంపం అంచు పట్టు చీర.
విదర్భకు చెందిన సంప్రదాయ నేత చీర.
టెంపుల్ బార్డర్ డిజైన్ లాగానే చేతితో నేసిన ఈ చీరకు రంపంలా కనిపించే అంచు ఉండడం ప్రత్యేకం.
దీనిని ఎక్కువగా కర్వత్-బార్డర్ సిల్క్ టస్సర్ అని ఎక్కువగా పిలుస్తుంటారు.
ఇది మహారాష్ట్రలోని భండారా జిల్లాలోని అంధల్‌గావ్, మొహదీ ప్రాంతాలకు చెందిన నేత కార్మికుల కళాత్మకతను చాటుతుంది.
కర్వత్‌కాఠీ చీర నేయడం 1990లలో అంధల్‌గావ్‌లో మొదలైంది. ఈ చీర నేయడానికి దాదాపు 8 రోజులు పడుతుంది.
చీరకు క్లిష్టమైన డిజైన్ వర్క్ ఉంటే ఆరు గజాల చీరను పూర్తి చేయడానికి 15 రోజులు పట్టొచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









