అమెరికా తొలి అధ్యక్షురాలిగా కమలా హారిస్ చరిత్ర సృష్టిస్తారా?
కమలా హారిస్ తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డ వలసదారులు. తల్లి భారతీయురాలు కాగా, తండ్రి జమైకా నుంచి వలసవచ్చారు.
మొదట ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన కమలా హారిస్ తర్వాత కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించిన తొలి నల్లజాతి దక్షిణాసియా మహిళగా నిలిచారు.
న్యాయవ్యవస్థలో జాతిపరమైన అసమానతలను రూపుమాపడం కోసం సంస్కరణలు తెచ్చేందుకు ప్రయత్నించారు. 2016లో అమెరికా సెనేట్‌కు ఎన్నికయ్యారు.
హై ప్రొఫైల్ కేసుల విచారణలో పదునుగా ప్రశ్నించే తీరు, ప్రగతిశీల విధానాల కోసం పరితపిస్తూ చేసే వాదనలు ఆమెను డెమోక్రటిక్ పార్టీలో ప్రత్యేకంగా నిలబెట్టాయి.
2019 ఎన్నికల ప్రచారం సమయంలో కమలా హారిస్‌ను అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామాతో సరితూగగల అభ్యర్థిగా చాలా మంది భావించారు.
ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న కమలా హారిస్ పూర్తి ప్రస్థానం ఈ వీడియోలో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









