నీరజ్ చోప్రా తల్లి మాటలపై పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఏమన్నారంటే..

వీడియో క్యాప్షన్, నీరజ్ చోప్రా తల్లి మాటలపై పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఏమన్నారంటే..
నీరజ్ చోప్రా తల్లి మాటలపై పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఏమన్నారంటే..

పాకిస్తాన్ జావెలిన్ త్రో అథ్లెట్ అర్షద్ నదీమ్ పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచారు. ఆగస్టు 8న రాత్రి జరిగిన ఫైనల్లో 92.97 మీటర్లు జావెలిన్ విసిరి ఒలింపిక్ రికార్డు కూడా సృష్టించారు. అదే ఈవెంట్‌లో రెండో స్థానంలో నిలిచిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రా రజతం సాధించారు.

ఈ ఈవెంట్ తర్వాత నీరజ్ చోప్రా తల్లి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌కు చెందిన అర్హద్ కూడా నాకు కొడుకులాంటి వాడే’’ అని అన్నారు. ఆమె మాటలు వైరల్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో అర్షద్‌ నదీమ్ బీబీసీతో మాట్లాడారు. తన ప్లానింగ్, టార్గెట్, మ్యాచ్ ఒత్తిడి, తదితర విషయాలతో పాటు నీరజ్ చోప్రా తల్లి అన్న ఆ మాటలపై కూడా స్పందించారు.

ఆయన పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)