గుజరాత్: కూనో అడవుల్లోకి సింహాలు వస్తాయని ఆదివాసీలను ఖాళీ చేయించారు... సింహాలూ రాలేదు, గిరిజనులకు పరిహారమూ అందలేదు

వీడియో క్యాప్షన్, కూనో నేషనల్ పార్క్‌లో సింహాల ఆవాసం కోసం 24 ఆదివాసీ గ్రామాలు ఖాళీ చేయించిన అధికారులు
గుజరాత్: కూనో అడవుల్లోకి సింహాలు వస్తాయని ఆదివాసీలను ఖాళీ చేయించారు... సింహాలూ రాలేదు, గిరిజనులకు పరిహారమూ అందలేదు

ఇరవయ్యేళ్ల కింద మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్ ప్రాంతం నుంచి సహరియా, భీల్ ఆదివాసీ తెగలకు చెందిన చాలా కుటుంబాలను వెళ్లగొట్టారు అధికారులు. గుజరాత్‌లోని గిర్ అడవుల నుంచి సింహాలను ఇక్కడికి తీసుకొస్తామని చెప్పారు.

20 ఏళ్లు గడిచాక... పార్క్‌లోకి సింహాలూ రాలేదు, ఆదివాసులకు నష్టపరిహారం, ఇతర సదుపాయాలు అందిస్తామన్న హామీలూ నెరవేరలేదు. గుజరాత్, ఎంపీ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రానికీ మధ్య రాజకీయాలు నడిచాయి.

చివరకు, 345 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న కూనో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని 750 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంతో నేషనల్ పార్క్‌గా చేశారు.

ఈ మధ్య నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చిరుతపులుల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలారు. కానీ స్థానిక ఆదివాసులు మాత్రం... తమ పునరావాసానికి సంబంధించిన హామీలేవీ ప్రభుత్వం నేరవేర్చలేదంటున్నారు.

బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావి అందిస్తున్న కథనం.

కూనో పార్క్

ఇవి కూడా చదవండి: